నర్సింగ్ ఇంటర్న్ ప్రియాంక మృతి, రెగీనా పరారీ

కాగా, ప్రియాంక మృతితో నర్సింగ్ స్కూల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రియాంక మృతి కేసులో న్యాయం జరగకపోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నర్సింగ్ హాస్టల్ వద్ద సెక్యూరిటీ గార్డులను నియమిస్తామని, సమస్యలను విన్నవించుకోవడానికి ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేస్తామని, ప్రియాంక కుటుంబానికి చెందిన ఇద్దరికి ఉద్యోగాలిస్తామని ఆస్పత్రి సూపరింటిండెంట్ డాక్టర్ కె. రామదాసు రాతవూర్వకమైన హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థినులు శాంతించారు. ప్రియాంక కుటుంబ సభ్యులకు రూ. 20 లక్షల నష్టపరిహారం ఇస్తామని కూడా రామదాసు హామీ ఇచ్చారు.
రెగీనా పదవీ విరమణ చేశారని, దాంతో ఆమె ఆచూకీ లభించడం లేదని, ప్రియాంక విషం తీసుకున్నప్పటి నుంచి ఆమె కనిపించడం లేదని, ఇంట్లో కూడా లేదని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం వచ్చినప్పుడు అరెస్టు చేస్తామని పోలీసులు అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications