వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ దాసరి ఉదయం డైలీ, మే 4న పునరుద్ధరణ?

By Pratap
|
Google Oneindia TeluguNews

Dasari Narayana Rao
హైదరాబాద్: పత్రికా రంగంలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన ఉదయం దినపత్రికను దాని వ్యవస్థాపకుడు, ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు పునరుద్ధరిస్తారని వార్తలు వస్తున్నాయి. తన జన్మదినం సందర్భంగా మే 4వ తేదీన దాన్ని తిరిగి ప్రారంభిస్తారని అంటున్నారు. దాసరి నారాయణ రావు చేతి నుంచి ఉదయం దినపత్రిక యాజమాన్యం కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి చేతుల్లోకి వెళ్లింది. అయితే, ఊహించని సమస్యల వల్ల అది మూత పడింది. ఆ పత్రికను దాసరి నారాయణ రావు ఎప్పటికప్పుడు పునరుద్ధరించాలని అనుకుంటున్నారు. ఆ పత్రికపై దాసరి నారాయణ రావుకు ఎనలేని మక్కువ ఉంది. దాన్ని తిరిగి తేవడం ద్వారా కాంగ్రెసు రాజకీయాలకు అండదండలు అందించాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

పార్టీకి తన సహాయసహకారాలు, అండదండలు ఉంటాయని, పదవి ఉన్నా లేకపోయినా పార్టీ శ్రేయస్సే తనకు ముఖ్యమని దాసరి నారాయణ రావు చెప్పుకోవడానికే సోనియా గాంధీకి మూడు పేజీల లేఖ రాసినట్లు చెబుతున్నారు. పార్టీలో గ్రూపిజాన్ని పోషిస్తున్నవారిని అడ్డుకోవాలని ఆయన సోనియా గాంధీకి తన లేఖలో సూచించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని బలహీనపరచవద్దని ఆయన సూచించారు. కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించినట్లు సమాచారం.

రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీ కాలం మార్చితో ముగుస్తోంది. ఇది వరకు ఓసారి ఆయన రాజ్యసభ సభ్యత్వం పొడిగించారు. ఈసారి పొడిగిస్తారా, లేదా అనేది అనుమానంగానే ఉంది. ఈ నేపథ్యంలో తిరిగి పార్టీ క్రియాశీలక పాత్ర పోషించడానికి ఆయన ముందుకు వచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

English summary
It is said that well noted producer and director Dasari Narayana Rao has decided to revive his Telugu daily Udayam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X