వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి, బొత్సలకు చెక్: దాసరి వెనుక కిరణ్ రెడ్డి?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy-Dasari Narayana Rao
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు దాసరి నారాయణ రావు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్రమంత్రులు ప్రణబ్ ముఖర్జీ, గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్‌లకు లేఖ రాశారనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దాసరి లేఖ వెనుక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. లేఖలో ముఖ్యమంత్రిపై ప్రశంసలు, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై పరోక్షంగా విమర్శలు చేశారనే వార్తల నేపథ్యంలో సిఎం సూచనల మేరకే ఆయన లేఖ రాసినట్లుగా ప్రచారం జరుగుతోంది. సిఎం కిరణ్ పార్టీని సున్నా నుండి తొంబై శాతానికి తీసుకు వచ్చారని, ఆయననే కొనసాగించాలని, అలా కాకుంటే మళ్లీ 1989 నాటి పరిస్థితులు పునరావృతమౌతాయని, కొందరు ఉద్దేశ్య పూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని, గ్రూపిజాన్ని పోషిస్తున్న వారిని అడ్డుకోవాలని ఆయన లేఖలో రాసినట్లు వార్తలు వచ్చాయి.

ఇటీవల పిసిసి చీఫ్, సిఎం కిరణ్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇరువురు నేతలు ఒకరిపై మరొకరు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. బొత్స, చిరంజీవిలు ఇద్దరూ ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసినప్పటికీ ఇరువురు కలిసి కట్టుగా కిరణ్‌కు చెక్ చెప్పాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. కల్తీసారా, బాక్సైట్ ఘటనలపై చిరంజీవి ఫైర్ కాగా, సమయం వచ్చినప్పుడు బొత్స సమావేశాలలో సిఎంను నిలదీసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో చిరంజీవిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు దాసరి స్థానాన్ని కేటాయించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దాసరి లేఖ వెనుక సిఎం ఉండి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే లేఖ రాసిన విషయాన్ని దాసరి మాత్రం కొట్టి పారేశారు. అయితే ఆయన ఈ లేఖ చాలా రోజుల క్రితమే రాశారని, దానికి సోనియా గాంధీ ప్రత్యుత్తరం కూడా రాసినట్లు వార్తలు వస్తున్నాయి.

English summary
It seems, CM Kiran Kumar Reddy behind MP Dasari Narayana Rao letter to AICC president Sonia Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X