మా పతంగి ముందు టిడిపి పతంగి నిలువదు: హరీష్

విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని కాంగ్రెసు పార్లమెంటు సభ్యులే ఆందోళన చేశారని గుర్తు చేశారు. ఎంపీలు విద్యార్థుల కేసు ఎత్తివేత కోసం ఉద్యమించాలని సూచించారు. దేశద్రోహం కేసులు పెట్టడం వల్ల తెలంగాణ విద్యార్థులకు కోర్టుల చుట్టూ తిరగడానికే సమయం సరిపోతోందన్నారు. కేసుల ఎత్తివేతపై కేంద్రహోంమంత్రి చిదంబరాన్ని త్వరలో కలుస్తామని చెప్పారు. కేసులు ఎత్తి వేసే వరకు ప్రభుత్వం నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా కోడిపందాలకు అనుమతి ఉందో లేదో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు.












Click it and Unblock the Notifications