హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాకు తెలిసింది చెప్పా: కెవిపి, 3గంటలపాటు విచారణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

KVP Ramachandra Rao
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రభుత్వ సలహాదారుగా పని చేసిన కెవిపి రామచంద్రా రావు సోమవారం ఉదయం సిబిఐ ఎదుట హాజరయ్యారు. ఆయనను సిబిఐ సుమారు మూడు గంటలకు పైగా విచారించింది. విచారణ అనంతరం కెవిపి రామచంద్రా రావు మీడియాతో మాట్లాడారు. ఎమ్మార్ కేసులో తనను సిబిఐ సాక్షిగా పిలిచిందని చెప్పారు. ఈ కేసు వ్యవహారంలో సిబిఐకి తనకు తెలిసింది చెప్పానన్నారు. సిబిఐ తనను కొన్ని వివరాలు అడిగిందని, తనకు తెలిసిన సమాచారం వారికి అందించానని తెలిపారు. సిబిఐ దర్యాఫ్తుకు తాను పూర్తిగా సహకరిస్తానన్నారు.

ఎమ్మార్‌లో కెవిపి రామచంద్రా రావు తన సతీమణి పేరుతో విల్లా కొన్నారు. ఆ విల్లాకు సంబంధించిన పత్రాలు తీసుకొని రావాల్సిందిగా కెవిపికి సిబిఐ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఆయన అందుకు సంబంధించిన పత్రాలతో హాజరయ్యారు. ఎమ్మార్ వ్యవహారం సమయంలో కెవిపి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. దీంతో ఈ వ్యవహారంలో ఆయనకు ఏమైనా తెలుసా అన్న కోణంలో సిబిఐ ఆయనను విచారించింది. ఆయన వాంగ్మూలాన్ని సిబిఐ నమోదు చేసింది.

English summary
KVP Ramachandra Rao said today after cbi enquiry that he told to CBI what he know about EMAAR. He continued that he is ready to cooperation with CBI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X