చిరంజీవికి మళ్లీ నిరీక్షణే, విస్తరణ 23న జరిగే ఛాన్స్

బుధవారం ఉదయం గవర్నర్ నరసింహన్ ఢిల్లీ వెళ్లనున్నారు. మరోవైపు చిరంజీవితో ఆ పార్టీ నేత గంటా శ్రీనివాస రావు మధ్యాహ్నం భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణపై వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా సమాచారం. ఉభయ గోదావరి జిల్లాల ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలు కూడా చిరంజీవిని కలవనున్నారు. కాగా అధిష్టానం కేవలం చిరంజీవి వర్గం నేతలతో విస్తరణకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా పునర్వ్యవస్థీకరణ కోరేందుకు కిరణ్ ఢిల్లీ వెళుతున్నట్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications