హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరు ఎమ్మెల్సీకి కౌంటర్: అధిష్టానానికి ఎమ్మెల్సీల లేఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: మంత్రి పదవి దక్కించుకోవాలని ఆశపడుతున్న మెగాస్టార్ చిరంజీవికి చెందిన ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యకు కాంగ్రెసులో కౌంటర్ ప్రారంభమైంది. మంత్రి వర్గ విస్తరణకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం ఆమోద ముద్ర వేయించుకోవడానికి ఢిల్లీ వెళ్లిన నేపథ్యంలో వాతావరణం వేడెక్కింది. ఎమ్మెల్సీలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలని కోరుతూ ఐదుగురు కాంగ్రెసు ఎమ్మెల్సీలు పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. ఎమ్మెల్సీ అయిన సి. రామచంద్రయ్యకు ఒక్కరికే మంత్రి పదవి ఇస్తే, తప్పుడు సంకేతాలు వెళ్తాయని, సమతూకం పాటించడానికి మరి కొంత మంది ఎమ్మెల్సీలకు మంత్రి పదవులు ఇవ్వాలని వారు పార్టీ అధిష్టానాన్ని కోరారు. సి. రామచంద్రయ్యకు మంత్రి పదవి రాకుండా అడ్డుకునే వ్యూహంలో భాగంగానే వారు ఈ లేఖ రాసినట్లు భావిస్తున్నారు.

తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఎమ్మెల్సీలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలని వారు కోరారు. ఇంద్రసేనా రెడ్డి, భానుప్రసాద్, జగదీశ్వర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, మాకం అధిష్టానానికి లేఖ రాసినవారిలో ఉన్నారు. పలువురు ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా కలిశారు. తమ లేఖను ఎమ్మెల్సీలు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు. ముప్పయేళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న ఎమ్మెల్సీలను పట్టించుకోవాలని వారు కోరారు. కాగా, మంత్రి వర్గంలో తెలంగాణవారికి ప్రాతినిధ్యం కల్పించాలని శాసనసభ్యుడు గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మంత్రి వర్గ విస్తరణకు మరోసారి బ్రేక్ పడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

English summary
Congress MLCs have written letter to party president Sonia Gandhi opposing ministry for MLC C Ramachandraiah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X