హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవికి షాక్: సిఎంతో ఎమ్మెల్యేల ప్రత్యేక భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: తమ నేత, మెగా స్టార్ చిరంజీవికి ప్రజారాజ్యం పార్టీకి చెందిన తూర్పు గోదావరి జిల్లా శాసనసభ్యులు షాక్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. చిరంజీవితో సంప్రదించకుండానే వారు మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇచ్చే బదులు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. ప్రజారాజ్యం నుంచి అత్యధికంగా శానససభ్యులు ఎన్నికయ్యారని, తమను విస్మరించి రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇవ్వడం సరి కాదని వారు ముఖ్యమంత్రితో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. వంగా గీత, బండారు సత్యానంద రావు తదితరులు ముఖ్యమంత్రిని కలిసినవారిలో ఉన్నారు. చిరంజీవిని సంప్రదించకుండా చిరంజీవిపై అసమ్మతి జెండా ఎగురేస్తూ వారు ముఖ్యమంత్రిని కలిసినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యకు, గంటా శ్రీనివాస రావుకు మంత్రి పదవులు ఇవ్వాలని చిరంజీవి పార్టీ అధిష్టానానికి సిఫార్సు చేశారు. గంటా శ్రీనివాస రావు విషయంలో అభ్యంతరం వ్యక్తం కావడం లేదు. రామచంద్రయ్య విషయంలోనే ఇటు కాంగ్రెసులోనూ అటు ప్రజారాజ్యంలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కడప జిల్లా కాంగ్రెసు నాయకులు, కాంగ్రెసు ఎమ్మెల్సీలు, తాజాగా ప్రజారాజ్యం తూర్పు గోదావరి జిల్లా శాసనసభ్యులు ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఈ కారణాలను చూపి ముఖ్యమంత్రి ప్రజారాజ్యం పార్టీని మంత్రి వర్గంలోకి తీసుకునే కార్యక్రమాన్ని వాయిదా వేస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

English summary
East Godavari district Prajarajyam MLAs met CM Kiran kumar Reddy opposing ministry to C Ramachandraiah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X