హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్‌పై వ్యాఖ్యలను సమర్థించుకున్న చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమర్థించుకున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని తాను అడవి పందిగా తిట్టలేదని ఆయన శనివారం స్పష్టం చేశారు. పంటను అడవి పంది నాశనం చేసిన విధంగా రాష్ట్రాన్ని వైయస్ రాజశేఖర రెడ్డి నాశనం చేశారని తాను అన్నట్లు ఆయన తెలిపారు. తాను వైయస్ రాజశేఖర రెడ్డిని దూషించలేదని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని ఎవరూ నష్టపరచనంతగా వైయస్ రాజశేఖర రెడ్డి నష్టపరిచారని, వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతిపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని వైయస్ రాజశేఖర రెడ్డి అభివృద్ధిలో 20, 30 ఏళ్లు వెనక్కి తీసుకుని వెళ్లారని ఆయన విమర్శించారు.

తన పోరాటం వ్యక్తులపై కాదని, తన పోరాటం ప్రజా వ్యతిరేక విధానాలపైనే అని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని వైయస్ రాజశేఖర రెడ్డి దోచుకుని నాశనం చేశారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో కుమ్మక్కయ్యారని ఆయన అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోలవరం టెండర్ల విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కుమ్మక్కయ్యారని ఆయన విమర్శించారు. రెండేళ్లు కూడా పార్టీని నడపలేదని చిరంజీవి ప్రజలకు ఎలా సేవ చేయగలరని ఆయన అన్నారు. పన్నుల రూపంలో ప్రభుత్వం ప్రజల రక్తం తాగుతోందని ఆయన అన్నారు. వస్త్రవ్యాపారుల ఆందోళనకు తమ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. మంత్రి పదవులు, శాఖల కోసం కాంగ్రెసులో కమ్ములాటలు చోటు చేసుకున్నాయని ఆయన అన్నారు. తమ 9 ఏళ్ల పాలనలో ఒక్క ఎకరం కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడామని, కాంగ్రెసు అధికారంలోకి రాగానే భూములను అమ్ముకుందని ఆయన అన్నారు.

English summary
TDP president N Chandrababu Naidu has clarified on his comments against YS Rajasekhar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X