సరైన సమయంలో ఒత్తిడి పెట్టలేదు: తెలంగాణపై కెకె

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎక్కడో లోపం జరిగిందని, లోపాలను సరిదిద్దుకుంటామని ఆయన చెప్పారు. త్వరలో తమ పార్టీ తెలంగాణ పార్లమెంటు సభ్యులం సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం ఆంధ్రా నేతలతోనూ చర్చిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమం వివాదాలకు దారితీయడం బాధాకరమని ఆయన చెప్పారు. తెలంగాణ ఇవ్వకపోతే తాము కొట్టుకుపోతామని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ పోటీ చేయడం వ్యర్థమని ఆయన అన్నారు.
ఎన్ని డిఆర్‌సి సమావేశాలు జరిగినా ఫలితం లేదని, హైదరాబాదు సమస్యలు పరిష్కారం అయ్యేట్లు లేవని కాంగ్రెసు పార్టీ మరో పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ప్రజల్లోకి వెళ్తే ఇబ్బందులు ఎదరువుతున్నాయని, సమస్యలు పరిష్కారం కాకపోవడమే అందుకు కారణమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications