హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శంకరరావు ఉద్వాసన సరైందే, మారనందుకే: శైలజానాథ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sailajanth
హైదరాబాద్: మంత్రి పదవి నుంచి పి. శంకరరావును బర్తరఫ్ చేయడాన్ని రాష్ట్ర ప్రాథమిక విద్యా మంత్రి శైలజానాథ్ సమర్థించారు. విప్ కొండ్రు మురళితో కలిసి ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పద్దతి మార్చుకోవాలని ముఖ్యమంత్రి, కాంగ్రెసు పార్టీ అధిష్టానం పెద్దలు శంకరరావుకు చాలా సార్లు చెప్పాలని, అయినా శంకరరావు తన పద్ధతిని మార్చుకోలేదని, దానివల్లనే మంత్రి పదవి నుంచి తప్పించాల్సి వచ్చిందని ఆయన వివరించారు. ఎమ్మార్పీయస్ నేత మందకృష్ణ మొదటి నుంచీ కాంగ్రెసు వ్యతిరేకి అని, మందకృష్ణ తీరు వల్ల దళితుల్లో గందరగోళం ఏర్పడుతోందని ఆయన అన్నారు. దళితులకు సేవ చేస్తోంది కాంగ్రెసు పార్టీ మాత్రమేనని ఆయన అన్నారు.

మంత్రి వర్గంలో ఎనిమిది మంది దళితులు ఉండాలని తాము మొదటి నుంచీ పోరాడుతున్నామని, అందుకు పోరాటం సాగిస్తామని ఆయన చెప్పారు. మంత్రివర్గం సమిష్టి నిర్ణయాలు తీసుకుంటుందని, ఆ సమిష్టి నిర్ణయాలే ప్రభుత్వ విధానాలుగా ముందుకు వస్తాయని, ఇటువంటి స్థితిలో సమిష్టి బాధ్యతను తీసుకోకపోవడం సరి కాదని ఆయన అన్నారు. శంకరరావు పదవి పోవడం స్వయం కృతాపరాధమేనని కొండ్రు మురళి అన్నారు. శాఖల మార్పులు చేర్పులు కాంగ్రెసు అంతర్గత వ్యవహారమని శైలజానాథ్ అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రులు సమిష్టి బాధ్యత వహిస్తారని ఆయన చెప్పారు.

English summary
Minister Sailajanath has supported removal of Shankar rao from cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X