ఎమ్మార్ కేసులో బిపి ఆచార్య అరెస్టుకు సిబిఐ రెడీ?

ఎమ్మార్‌తో కుదిరిన ఒప్పందంలో ప్రభుత్వ వాటా తగ్గించడానికి ఆచార్యనే బాధ్యుడని సిబిఐ నిర్ధారణకు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు కోనేరు ప్రసాద్, సునీల్ రెడ్డి అరెస్టయ్యారు. కుంభకోణానికి ప్రభుత్వ వ్యవహారమే కారణం కాబట్టి అందుకు సంబంధించిన అధికారులను అరెస్టు చేయక తప్పడం లేదని అంటున్నారు. సీనియర్ ఐఎఎస్ అధికారి కావడంతో ఆచార్య అరెస్టుకు కేంద్రం అనుమతులు కావాల్సి ఉంటుంది. అనుమతుల విషయంలో జాప్యం కావడం వల్లనే ఆచార్య అరెస్టులో ఆలస్యం జరుగుతోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications