విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లగడపాటి రాజగోపాల్‌కు వల్లభనేని వంశీ సవాల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Vallabhaneni Vamsi
విజయవాడ: కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌కు తెలుగుదేశం నాయకుడు వల్లభనేని వంశీ సవాల్ విసిరారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని, ఏ సెంటర్‌లోనైనా తాను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యుడిగా తన నియోజకవర్గానికి లగడపాటి ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తనపై లగడపాటి తన అనుచరులతో విమర్శలు చేయిస్తున్నారని ఆయన అన్నారు. లగడపాటి రాజగోపాల్ అనుచరుల గురించి గానీ ఏ పార్టీని అడ్డం పెట్టుకుని లగడపాటి రాజగోపాల్ సంపాదించారనే విషయంపై గానీ తాను మాట్లాడబోనని ఆయన అన్నారు.

కాలం చెల్లిన కమ్యూనిస్టులతో, మూడు శాతం ఓట్లు కూడా లేని తెలంగాణ రాష్ట్ర సమతి (తెరాస)తో పొత్తు కోసం తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వెంపర్లాడినట్లు లగడపాటి చేసిన వ్యాఖ్యలపైనే తన అభ్యంతరమని ఆయన అన్నారు. 2004లో కమ్యూనిస్టులతో, తెరాసతో కాంగ్రెసు ఎందుకు పొత్తు పెట్టుకుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చిరంజీవి పార్టీ పెట్టడంపై, దాన్ని కాంగ్రెసులో విలీనం చేయడంపై తాను మాట్లాడబోనని ఆయన అన్నారు. చిరంజీవిని ఎన్నికల సమయంలో లగడపాటి రాజగోపాల్ విమర్శించిన తీరును ఆయన ఎత్తి చూపారు. 14ఎఫ్‌ను రద్దు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన లగడపాటి మాట తప్పారని, లగడపాటి మాటలకు విశ్వసనీయత లేదని ఆయన అన్నారు.

English summary
TDP leader Vallabhaneni Vamsi has challenged Congress Vijayawada MP Lagadapati Rajagopal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X