జగన్ వర్గం ఎమ్మెల్యేలందరిపై వేటు: కొండ్రు మురళి

Kondru Murali
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన తమ పార్టీ శాసనసభ్యుల్లో ఎవరికి కూడా మినహాయింపు ఉండదని, అందరిపై అనర్హత వేటు పడుతుందని ప్రభుత్వ విప్ అన్నారు. జగన్ వర్గానికి చెందిన 16 మంది శానససభ్యులపై అనర్హత వేటు వేయాలని ఇచ్చిన ఫిర్యాదుపై విచారణకు ఆయన సోమవారం శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ముందు హాజరయ్యారు. జగన్ వర్గానికి చెందిన 16 మందిలో 13 మంది విప్‌లు అందుకున్నారని ఆయన చెప్పారు. కాపు రామచంద్రా రెడ్డి, ప్రసాద్ రాజు, చెన్నకేశవ రెడ్డి విప్‌లను స్వయంగా తీసుకోలేదని ఆయన చెప్పారు. అయితే వారికి తాము టెలిగ్రామ్‌లు ఇచ్చామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు.

ముగ్గురు శాసనసభ్యుల ఇళ్ల తలుపులకు విప్ కార్డు అతికించామని ఆయన చెప్పారు. స్పీకర్ అడిగిన ప్రశ్నలకు తాను సంతృప్తికరమైన సమాధానాలు ఇ్చచ్చానని ఆయన చెప్పారు. కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డితో ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి సోమవారం ఉదయం భేటీ అయ్యారు. ఈ సమావేశానికి చెన్నకేశవరెడ్డి, శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు. అనర్హత వేటు, భవిష్యత్ కార్యాచరణపై వారు చర్చించినట్లు సమాచారం. కాగా, కాపు రామచంద్రా రెడ్డి తనకు విప్ అందలేదని చెబుతుండగా, ఆయన విప్‌ను తిరస్కరించారని కాంగ్రెసు ఎమ్మెల్యే ఒకరు స్పీకర్ ముందు సాక్ష్యం ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+