వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీంలో పిఎంవోకు షాక్, స్వామి పిటిషన్ స్వీకరణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Subrahmanyam Swami
న్యూఢిల్లీ: 2జి కుంభకోణం కేసులో ప్రధానమంత్రి కార్యాలయానికి మంగళవారం చుక్కెదురైంది. ఈ కేసులో ప్రధానమంత్రి కార్యాలయం పాత్రపై విచారణ జరిపించాలన్న జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ అధికారులు విచారణను ఎదుర్కొనడానికి ఆయా సంస్థలు మూడు నెలల్లోగా అనుమతి ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. అప్పటి లోగా అనుమతులు రాకుంటే అనుమతులు ఇచ్చినట్లుగానే భావించవలసి ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో విచారణ చేసేందుకు అనుమతి ఇచ్చేందుకు నిర్దిష్ట కాలపరిమితి అంటూ ఉండాలని సూచించింది. అవినీతి నిరోధక చట్టాన్ని సవరించాల్సి ఉందని అభిప్రాయపడింది. ఇలాంటి కేసులకు సంబంధించి తగిన మార్గదర్శకాలు రూపొందించాలని పేర్కొంది. ఆ మార్గదర్శకాలు రూపొందించే బాధ్యత పార్లమెంటుదేనన్నారు. నెలలోగా ఎజి అభిప్రాయం తప్పనిసరిగా తెలుసుకోవాలన్నారు. రాజా కేసులో అనుమతి ఇవ్వడానికి ప్రధానమంత్రి కార్యాలయం సుదీర్ఘ సమయం తీసుకోవడాన్ని సుబ్రహ్మణ్య స్వామి తన పిటిషన్‌లో తప్పు పట్టారు.

సుప్రీం తీర్పుపై సుబ్రహ్మణ్య స్వామి హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు అన్యాయంపై పోరాటం చేసే వారికి బూస్ట్ వంటిందన్నారు. కాగా 2జి కేసులో ప్రధాని కార్యాలయం పాత్రపై విచారణ జరపాలని, అధికారుల పాత్రలపై విచారణకు కేంద్రం నిర్దిష్ట పరిమితిలోగా అనుమతివ్వాలని సూచనలు చేసిన నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ కోర్ కమిటీ అత్యవసరంగా భేటీ అయింది. ఏఐసిసి అధ్యక్షురాలో సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెసు పెద్దలు భేటీ అయ్యారు. సుప్రీం వ్యాఖ్యలను సమీక్షిస్తున్నారు. కాగా రాడియా టేపులు డూప్లికేట్ అని కేంద్రం అంటోంది.

English summary
Setting aside the Delhi high court judgement on sanction of prosecution in 2G case, the Supreme Court on Tuesday held that filing of a complaint under the Prevention of Corruption Act is a constitutional right of a citizen and the competent authority should take a decision on giving the sanction within a time frame.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X