ఐఏఎస్‌ల ఇష్యూ: ఏకీభవించిన బొత్స, ఉండవల్లి ఫైర్

మరోవైపు ఐఏఎస్‌ల వ్యాఖ్యలతో అదే కాంగ్రెసు పార్టీ చీఫ్ బొత్స సత్యనారాయణ, గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివ రావులు ఏకీభవించారు. మంత్రుల పాత్ర ఉంటే విచారించాలన్న వారి వాదనతో తాను ఏకీభవిస్తున్నానని బొత్స చెబుతూనే తెర వెనుక జరిగే వాటికి కేబినెట్ బాధ్యత ఉండదని చెప్పారు. అవినీతికి ఐఏఎస్‌లను బలి చేయడం బాధాకరమని రాయపాటి వారికి సానుభూతి వ్యక్తం చేశారు. ఇతర పార్టీలు అవినీతి ఐఏఎస్‌ల తీరు తప్పు పడుతూనే, నీతివంతమైన అధికారులకు మద్దతు ప్రకటించాయి. అయితే అవినీతి చేసిన అధికారులు కూడా మంత్రుల ఆదేశాలు లేకుండా చేయరని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సిబిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. అవినీతికి పాల్పడని అధికారులను టార్గెట్ చేసుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మంత్రులు చెప్పినట్లుగా మీరెందుకు నడుచుకుంటున్నారని అధికారులను వారు ప్రశ్నించారు. టిడిపి నేత యనమల కూడా కేవలం ఐఏఎస్‌లనే బాధ్యులను చేయడం సరికాదన్నారు. మంత్రుల బాధ్యత లేదన్న ఉండవల్లిపై ఆయన మండిపడ్డారు. మరికొందరు అధికారులు కేవలం ఐఏఎస్‌లనే బాధ్యులను చేయవద్దని అన్నారు. ఒత్తిడి కారణంగా తప్పు చేస్తే అధికారులు సిబిఐకి చెప్పాలని మాజీ అధికారి హెచ్ జె దొర సూచించారు.












Click it and Unblock the Notifications