హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ స్కామ్‌లో లగడపాటి కంపెనీ పాత్ర: కోదండరామ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: సోలార్ ఎనర్జీ కుంభకోణంలో కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కంపెనీ పాత్ర ఉందని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ ఆరోపించారు. ఈ స్కామ్ వల్ల 13,500 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని ఆయన అన్నారు. లగడపాటి రాజగోపాల్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్రమంగా సంపాదించడానికే లగడపాటి సమైక్యాంధ్ర అంటున్నారని ఆయన అన్నారు. పోలీసుల చేతిలో గాయపడిన కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థి యాకూబ్ రెడ్డి కేసును దర్యాప్తు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయడం సరి కాదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. నిజంగా తప్పు చేయకపోతే ప్రభుత్వం ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని ఆయన అన్నారు. యాకూబ్ రెడ్డిని హింసించినవారికి ప్రభుత్వం మంచి పదవులు కట్టబెట్టిందని ఆయన విమర్శించారు. సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటే తమ ఒత్తిడి కొంత మేరకు ఫలించినట్లేనని ఆయన అన్నారు.

యాకూబ్ కేసు విషయంలో ఆమ్మెన్టీకి ఫిర్యాదు చేస్తామని, అంతర్జాతీయ హక్కుల సంస్థలకు కూడా వెళ్తామని ఆయన చెప్పారు. సిబిఐ విచారణ నుంచి పోలీసులు తప్పించుకోలేరని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెసు నేతలు పదవులు తీసుకోవడం శోచనీయమని ఆయన అన్నారు. పదవులు తీసుకున్న ద్రోహులను నిలదీయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. పదవులు తీసుకున్న కాంగ్రెసు నాయకులకు సన్మానాలు చేస్తే అడ్డుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఖాళీగా ఉన్న పదపులను తీసుకోవడానికి తెలంగాణ ప్రజల ఆకాంక్షను తాకట్టు పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

English summary
Telangana political JAC chairman Kodandaram accused Congress MP Lagadapati Rajagopal's company is involved in Solar Energy scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X