హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాక్షుల జాబితాలో పిసిసి చీఫ్ బొత్స, అంబటి రాంబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bosta Satyanarayana-Ambati Rambabu
హైదరాబాద్: ఎమ్మార్ కేసులో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్లను సిబిఐ సాక్షులుగా పేర్కొన్నది. ఓబుళాపురం మైనింగ్ కేసులో నాటి గనుల శాఖ మంత్రి, ప్రస్తుత హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని సాక్షిగా సిబిఐ చేర్చిన విషయం తెలిసిందే. తాజాగా ఎమ్మార్ కేసులో నాటి పరిశ్రమల శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను 17వ సాక్షిగా చేర్చింది. ఎమ్మార్ చార్జిషీటును సిబిఐ కోర్టులో దాఖలు చేసిన సిబిఐ అధికారులు మొత్తం 286 మంది సాక్షులను విచారించినట్లు పేర్కొన్నారని తెలుస్తోంది. ఎమ్మార్ స్కామ్‌పై గతంలో బొత్స సత్యనారాయణ ఇంటికి వెళ్లి సిబిఐ అధికారులు ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్నారు. అంతా నిబంధనల ప్రకారమే జరిగిందని, తన వద్దకు వచ్చిన ఫైళ్లను రొటీన్ పద్దతిలోనే ప్రాసెస్ చేసి పంపించానని బొత్స సిబిఐ అధికారులకు వివరించినట్లు సమాచారం.

ఎమ్మార్‌లో ఎపిఐఐసి వాటా ఎందుకు తగ్గింది? అప్పట్లో ప్రభుత్వ నిబంధనలను పాటించారా? ఎమ్మార్ ఒప్పందం జరిగినపుడు అసలేం జరిగింది అనే విషయాలపై బొత్స నుంచి సిబిఐ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. మరోవైపు ఇదే కేసు సాక్షుల జాబితాలో అప్పట్లో ఎపిఐఐసి చైర్మన్‌గా పనిచేసిన అంబటి రాంబాబును 27వ సాక్షిగా సిబిఐ పేర్కొంది. రాంబాబు హయాంలోనే ఎపిఐఐసి వాటా తగ్గిందనే ఆరోపణలు దగ్గర్నుంచి, రాంబాబు బంధువులకు విల్లాల కేటాయింపులు, ఇతరత్రా అంశాలపైనా సిబిఐ అధికారులు వివరణ తీసుకున్నారని సమాచారం. సిబిఐ విచారణ తర్వాత అప్పట్లో మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు తాను సిబిఐ ముందుకు సాక్షిగానే వచ్చానని పేర్కొన్న విషయం తెలిసింది. ప్రస్తుత ఎపిఐఐసి ఎండి బిఆర్ మీనాను ఎమ్మార్ చార్జిషీట్‌లో 16వ సాక్షిగా సిబిఐ పేర్కొంది.

English summary
CBI named, PCC chief Botsa satyanarayana and YSR Congress Party spokes person Ambati Rambabu as witness in EMAAR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X