హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆజాద్ బుజ్జగింపులు, రాజీనామాపై తగ్గని డిఎల్ రవీంద్ర

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ghulam Nabi Azad-DL Ravindra Reddy
హైదరాబాద్: తన శాఖల కత్తిరింపును అవమానంగా భావిస్తూ రాజీనామాకు సిద్ధపడిన మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డికి అధిష్టానం బుజ్జగింపులు ప్రారంభించింది. బుధవారం కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ డిఎల్ రవీంద్రా రెడ్డికి పలుమార్లు ఫోన్ చేసి రాజీనామా చేయవద్దని కోరినట్లుగా తెలుస్తోంది. అయితే డిఎల్ మాత్రం ససేమీరా అంటున్నారని సమాచారం. తాను తన శాఖను ఎప్పుడు సమర్థవంతంగా నిర్వహించలేదో చెప్పాలని ఆయన సిఎం కిరణ్‌ను ప్రశ్నిస్తున్నారు. అధిష్టానం ఎంతగా చెప్పినప్పటికీ ఆయన మాత్రం రాజీనామాకు మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్ తనను టార్గెట్ చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన మరికాసేపట్లో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణను కలవనున్నారు.

శాఖల తొలగింపు, మార్పులు ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా జరుగుతుందని డిఎల్ రవీంద్రా రెడ్డి చెప్పారు. ఏ శాఖ ఇచ్చినా తనకు సమర్థవంతంగా నిర్వహించే శక్తి ఉందన్నారు. ఈ ప్రభుత్వాన్ని నడిపేది కాంగ్రెసు పార్టీ కాదని, డబ్బులున్న వ్యక్తులని ఆరోపించారు. సిఎం కిరణ్ తానొక్కడినే కాంగ్రెసు పార్టీ అనుకుంటున్నారని మండిపడ్డారు. కాగా మంగళవారం ఉదయమే ఆయన శాఖల కత్తిరింపు మీద ముఖ్యమంత్రిపై తన అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న డిఎల్ రాత్రి కడప నుండి హైదరాబాద్ వచ్చారు. రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు కూడా ఆయనను బుజ్జగిస్తున్నట్లుగా సమాచారం.

డిఎల్ రవీంద్రా రెడ్డిని రాజీనామా చేయవద్దని కోరామని కమలాపురం ఎమ్మెల్యే వీర శివా రెడ్డి అన్నారు. గులాం నబీ ఆజాద్, ముఖ్యమంత్రి కిరణ్‌ను కలిసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు. గురువారం కడప జిల్లా నేతలతో సమావేశమవుతామన్నారు.

English summary
Central Minister Ghulam Nabi Azad phoned to minister DL Ravindra Reddy and appealed to don't resign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X