హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజీనామా చేయాలి: హరికృష్ణ, మోపిదేవిపై టిడిపి ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harikrishna-Devineni Umamaheswara Rao
హైదరాబాద్: ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణపై తెలుగుదేశం పార్టీ నేతలు బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర కేబినెట్ మద్యం మత్తులో ఉందని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ బుధవారం ఆరోపించారు. మంత్రి మోపిదేవి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోపిదేవి రాజీనామా చేయాలని కృష్ణా జిల్లా అధ్యక్షుడు, శాసనసభ్యుడు దేవినేని ఉమా మహేశ్వర రావు డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా చేయకుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. లిక్కర్ మాఫియాతో ఆయనకు సంబంధముందని రుజువైందన్నారు. ముడుపులు తీసుకున్న మోపిదేవి ఇంకా ఎవరిని మభ్య పెట్టేందుకు తప్పించుకో చూస్తున్నారని మరో నేత దూళిపాళ్ల నరేంద్ర గుంటూరులో ప్రశ్నించారు. ఆయనను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయన మంత్రి అయ్యాక రాష్ట్రంలో ఎన్ని కొత్త బార్లు వచ్చాయో చెప్పమనండి అని అడిగారు. ఆయనను తొలగించేందుకు ముఖ్యమంత్రి ఎందుకు తాత్సారం చేస్తున్నారని అన్నారు. ముడుపులు తీసుకున్నారని తెలిశాక కూడా సిఎం మౌనంగా ఉండటం శోచనయమన్నారు.

కాంగ్రెసులో ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ మద్యం సిండికేట్లతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని అదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు రమేష్ రాథోడ్ అదిలాబాద్ జిల్లాలో విమర్శించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంటే నియంత్రించాల్సింది పోయి సిండికేట్లతో కుమ్మక్కు కావడమేమిటన్నారు. మద్యం దోపిడీలో సిఎం వాటా ఎంతో తేల్చాలని డిమాండ్ చేశారు. దోపిడీకి పాల్పడుతున్న వారిపై సిబిఐ దాడులు మరింత తీవ్రతరం చేయాలన్నారు.

English summary
Telugudesam Party leaders like Harikrishna, Devineni Umamaheswara Rao demanded for minister Mopidevi Venkata Ramana resignation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X