హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్సార్ భూకేటాయింపులపై సభా సంఘం

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం హయాంలో జరిగిన భూకేటాయింపులపై శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ బుధవారం సభా సంఘాన్న నియమించారు. మొత్తం 15 మందితో కూడిన ఈ కమిటీని స్పీకర్ నియమించారు. ఈ కమిటీ ఛైర్మన్‌గా పి. కిష్ణా రెడ్డి ఉంటారు. ఆరు నెలల్లోగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపుల్లో, ప్రత్యేక ఆర్థిక మండళ్లకు (సెజ్‌లకు) భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ గత శానససభ సమావేశాల్లో ఆరోపిస్తూ ఆ వ్యవహారాలపై సభా సంఘం వేయాలని పట్టుబట్టింది. అందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఆ అంగీకారం మేరకు నాదెండ్ల మనోహర్ ఇప్పుడు సభా సంఘాన్ని నియమించారు.

జయప్రకాశ్ నారాయణ్ (లోకసత్తా), అక్బరుద్దీన్ ఒవైసీ (మజ్లీస్), పయ్యావుల కేశవ్ (తెలుగుదేశం), వీర శివారెడ్డి (కాంగ్రెసు), అశోక్ గజపతి రాజు (తెలుగుదేశం), జగ్గా రెడ్డి (కాంగ్రెసు), సత్యానందరావు, పోచారం శ్రీనివాస రెడ్డి (తెలంగాణ రాష్ట్ర సమితి), జూలకంటి రంగారెడ్డి (సిపిఎం), జి.వి. శేషు (కాంగ్రెసు), శ్రీనివాస రెడ్డి, జి. రవి, గుండా మల్లేశ్ (సిపిఐ), సూర్యప్రకాశ్,కె. వెంకట్రామరెడ్డి తదితరులు ఈ కమిటీలో ఉన్నారు.

English summary
Speaker Nadendla Manohar constituted House committee on land allocations in the regime of YS Rajasekhar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X