హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డికి భయం పట్టుకుంది: కెటిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

KT Rama Rao
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటిదని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామా రావు బుధవారం విమర్శించారు. తన సిఎం సీటు ఎప్పుడు పోతుందోనని కిరణ్ కుమార్ రెడ్డిలో భయం ఉందని అన్నారు. ఎంతమంది తెలంగాణ నేతలను మంత్రివర్గంలోకి తీసుకున్నా తెలంగాణ ప్రాంతానికి ఒరిగేది ఏమీ ఉండదన్నారు. మంత్రులతో ఉద్యమాన్ని దెబ్బ తియాలని కిరణ్ భావిస్తున్నట్లుగా ఉన్నారని, కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ఉద్యమం దెబ్బతీయలేరన్నారు. మంత్రివర్గ మార్పుల వల్ల ఎలాంటి లాభముండదమన్నారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్ని పార్టీలకు చెందిన నేతలు రాజకీయాలకతీతంగా విచారణను ఎదుర్కొనేందుకు అంగీకరించాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలన్నారు.

తెలంగాణ పేరు చెప్పి కాంగ్రెసు పార్టీ నేతలు పదవులు పొందుతున్నారని టిఎన్జీవో నేత స్వామి గౌడ్ వేరుగా మహబూబ్ నగర్ జిల్లాలో ధ్వజమెత్తారు. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి మాట తప్పారని ఆరోపించారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తామన్నారు. మార్చిలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా టిఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు దంపతులు గురువారం మేడారం సమ్మక్క-సారక్క అమ్మవార్లను దర్షించుకోనున్నారు.

English summary
TRS MLA KT Rama Rao blamed CM Kiran Kumar Reddy that he is in fear about CM Post. He demanded to minister Mopidevi resignation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X