హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆబ్కారీ మంత్రి మోపిదేవికి చుట్టుకున్న ఎసిబి దాడులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Mopidevi Venkataramana
హైదరాబాద్: లిక్కర్ సిండికేట్లపై అవినీతి నిరోధక శాఖ చేసిన దాడుల వ్యవహారం మంత్రి మోపిదేవి వెంకటరమణకు చుట్టుకుంది. మోపిదేవికి పది లక్షల రూపాయల లంచం ఇచ్చినట్లు నున్నా వెంకటరమణ అనే రింగ్ లీడర్ తన వాంగ్మూలంలో చెప్పిన విషయంపై ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. దీంతో మోపిదేవి వెంకటరమణపై దుమారం చెలరేగడం ప్రారంభమైంది. దానిపై ఆబ్కారీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఎసిబిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక నేర చరితుడు తనపై ఆరోపణలు చేయడం, దానిని నిర్థారించుకోకుండా, తన వివరణ తీసుకోకుండానే కోర్టుకు సమర్పించిన నివేదికలో ఏసీబీ అధికారులు తన పేరును ప్రస్తావించడంపై మండిపడ్డారు. రిమాండ్ రిపోర్టులో తన పేరును ప్రస్తావించిన ఏసీబీ అధికారులపై చర్య తీసుకుంటారో లేక తన రాజీనామాను ఆమోదిస్తారో బుధవారం ఉదయం నేరుగా ముఖ్యమంత్రి కిరణ్‌తోనే తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఓ ప్రముఖ దినపత్రిక ప్రతినిధితో మాట్లాడారు.

ముఖ్యమంత్రితో మాట్లాడి ఆయన ఆదేశాల మేరకు నడుచుకుంటానని, రాజీనామాకైనా సిద్ధమని స్పష్టం చేశారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తి చెబితే తన పేరును రిమాండ్ రిపోర్టులో పెట్టడం సరైనదేనా అని ఆయన ప్రశ్నించారు. తన పేరును నివేదికలో ప్రస్తావించిన అధికారి తన వివరణ తీసుకోవాల్సిన బాధ్యతను మరిచారా? అంటూ ఆగ్రహించారు. పూర్తి విచారణ చేయకుండా.. ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా వ్యవహరించారని ఆక్షేపించారు. ఏ సిండికేట్లతోనూ తనకు సంబంధం లేదని, ఇదే విషయాన్ని ఇప్పటికే అనేక సందర్భాల్లో స్పష్టం చేశానని చెప్పారు. సిండికేట్ల నిర్వాహకులతోనూ తనకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు.

తన క్లాస్‌మేట్ రాజేంద్ర అని, రిమాండు నివేదికలో ఉన్న బాబ్జీ, రాజాబాబులతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన ప్రస్తావన ఎందుకు వచ్చిందనే అంశంపై ఏసీబీ నుంచి వివరణ తీసుకుంటానని చెప్పారు. సిండికేట్ల నుంచి తనకు ముడుపులు ముట్టాయని తేలితే ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు. ముక్కు, ముఖం తెలియని వ్యక్తి ఎవరో తనకు డబ్బులు ఇచ్చారంటే ఎలా..? అని ప్రశ్నించారు. ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విచారణ చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరతానని చెప్పారు.

English summary
Excise minister Mopidevi Venkataramana is trouble with the ACB arrests in liquor syndicates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X