హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గంజాయి వ్యాపారిని ఎలా నమ్ముతారు: ఎమ్మెల్యే కవిత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Maloth Kavitha
హైదరాబాద్: తాను మద్యం వ్యాపారుల నుండి ముడుపులు తీసుకున్నట్లుగా వచ్చిన వార్తలను మహబూబాబాద్ శాసనసభ్యురాలు కవిత బుధవారం ఖండించారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆమె అన్నారు. గిరిజన మహిళను అయిన తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు తన కుటుంబంపై ఎలాంటి మచ్చ లేదన్నారు. మద్యంను ఎమ్మార్పీ ధరకే అమ్మాలని గతంలో తాను ముఖ్యమంత్రిని పలుమార్లు కోరానని అన్నారు. అలాంటి తాను ముడుపులు ఎందుకు తీసుకుంటానన్నారు. అలాంటి అవసరం తనకు ఏమాత్రం లేదన్నారు. ఓ గంజాయి వ్యాపారి, డెకాయిట్ చేసిన ఆరోపణలు ఎలా నమ్ముతారని ఆమె ప్రశ్నించారు. మద్యం వ్యాపారి రమణ ఎవరో తనకు తెలియదన్నారు.

మరోవైపు తాను మద్యం వ్యాపారుల నుండి ముడుపులు తీసుకున్నానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని సిపిఎం నేత నాగేశ్వరరావు చెప్పారు. తాను నాలుగేళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని, అలాంటి తనపై బురద జల్లడం సరికాదన్నారు. సిపిఐ న్యూడెమోక్రసీ కూడా ముడుపుల ఆరోపణలను ఖండించింది. తాము ఎవరి నుండి ముడుపులు తీసుకోలేదన్నారు. పార్టీ కార్యక్రమాల కోసం తీసుకున్నామని, అందుకు రశీదులు కూడా ఇచ్చామని చెప్పారు. వ్యక్తిగత అవసరాల కోసం డబ్బులు తీసుకోలేదన్నారు. కాగా ఎమ్మెల్యే కవిత రూ.నాలుగున్నర లక్షలు, సిపిఐ న్యూడెమోక్రసీ నేత రూ.నాలుగున్నర లక్షలు, సిపిఎం నేత నాగేశ్వర రావు రూ.మూడు లక్షలు తీసుకున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

English summary
Congress MLA Kavitha condemned bribery from liquor syndicate. She said she don't know who is Ramana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X