హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముఖ్యమంత్రితో మోపిదేవి భేటీ, ఆరోపణలపై వివరణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Mopidevi Venkataramana
హైదరాబాద్: మద్యం సిండికేట్ల విషయంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆబ్కారీ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ బుధవారం ఉదయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఆయన ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చారు. తాము మోపిదేవి వెంకటరమణకు పది లక్షల రూపాయల లంచం ఇచ్చామని మద్యం సిండికేట్ల వ్యవహారంలో అరెస్టయిన నున్నా రమణ అలియాస్ వెంకటరమణ ఆరోపించిన నేపథ్యంలో మోపిదేవి ముఖ్యమంత్రిని కలిశారు. తాము లంచం ఇచ్చామని వెంకటరమణ చెప్పినట్లు అవినీతి నిరోధక శాఖ (ఎసిపి) రిమాండ్ రిపోర్టులో తెలిపింది. వరంగల్ జిల్లాకు చెందిన వెంకటరమణను ఎసిబి అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. ఆరోపణలు ఎదుర్కుంటున్న మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మోపిదేవి ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చారు.

ముఖ్యమంత్రితో మాట్లాడి ఆయన ఆదేశాల మేరకు నడుచుకుంటానని, రాజీనామాకైనా సిద్ధమని మోపిదేవి ఇదివరకే స్పష్టం చేశారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తి చెబితే తన పేరును రిమాండ్ రిపోర్టులో పెట్టడం సరైనదేనా అని ఆయన ప్రశ్నించారు. తన పేరును నివేదికలో ప్రస్తావించిన అధికారి తన వివరణ తీసుకోవాల్సిన బాధ్యతను మరిచిపోయారని ఆయన అన్నారు. పూర్తి విచారణ చేయకుండా ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా వ్యవహరించారని అన్నారు. ఏ సిండికేట్లతోనూ తనకు సంబంధం లేదని, ఇదే విషయాన్ని ఇప్పటికే అనేక సందర్భాల్లో స్పష్టం చేశానని చెప్పారు. సిండికేట్ల నిర్వాహకులతోనూ తనకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు.

English summary
Excise Minister Mopidevi Venkataramana, who is facing allegations in liquor syndicates issue, met CM Kiran Kumar Reddy and explained his stand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X