హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బొత్సను టార్గెట్ చేసి సిఎం కిరణ్ ఇరుకున పడ్డారు: రోజా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Roja
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ లక్ష్యంగా ఎసిబి దాడులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేయించగా, పలువురు మంత్రులు, శాసనసభ్యులకూ ప్రమేయం ఉండటంతో తిరిగి అది కిరణ్‌కే భస్మాసుర హస్తమైందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత రోజా గురువారం విమర్శించారు. పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మద్యం సిండికేట్‌లతో 20 మంది మంత్రులు, 40 మంది ఎమ్మెల్యేలకు సంబంధాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. మద్యం అదనపు ఉత్పిత్తికి ఏడాది కాలంలో 17 ఉత్తర్వులు వెలువరించడం సిగ్గు చేటని సిఎంపై ధ్వజమెత్తారు. సిఎల్‌పి అంటే కాంగ్రెస్ లిక్కర్ పార్టీగా మారిందన్నారు. మద్యాంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్‌కు అధ్యక్షుడని బొత్సను విమర్శించారు. నిషేధాన్ని ఎత్తి వేసి, బెల్టు షాపులకు కారణమైన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మాట్లాడే హక్కు లేదని అన్నారు. తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గ ఎమ్మెల్యేలపై వేటు వేస్తే భయపడేది లేదని రోజా అన్నారు.

భూపందేరంపై శాసనసభా సంఘం ఏర్పాటును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. అయితే, కమిటీ విచారణ పరిధిని కేవలం వైఎస్ హయానికే పరిమితం చేయకుండా 1995 నుంచి 2012 వరకు జరిగిన భూ కేటాయింపుల నిజానిజాలు నిగ్గు తేల్చాలని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, పార్టీ నేత నల్లా సూర్యప్రకాష్‌రావు డిమాండ్ చేశారు.

English summary
YSR Congress Party leader Roja fired at CM Kiran Kumar Reddy on Thursday. She accused PCC chief Botsa Satyanarayana, he is president to madyandhra pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X