విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టెక్కీలను ఉద్యోగాల పేరుతో మోసం ముఠా అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Vishakhapatnam
హైదరాబాద్: ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులైన టెక్కీలను మోసం చేసిన ముఠాను సిఐడి సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఐబిఎం వంటి సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆ ముఠా అశ చూపింది. దాదాపు 37 మందిని ఓ మహిళ, ఆమె అనుచరుడు మోసం చేశారు. నకిలీ ఆఫర్ లెటర్స్ ఇచ్చి టెక్కీల నుంచి 55 వేల రూపాయల దాకా వారు వసూలు చేశారు. టెక్కీలను మోసం చేసిన కె. శ్రీలక్ష్మి (34), ఆమ అనుచరుడు జి. ఆనంద్ (37) విశాఖపట్నానికి చెందినవారు.

వారి సెల్‌ఫోన్ల ద్వారా, ఇ - మెయిల్ ఐడిల ద్వారా పంపిన సమాచారాన్ని ఆధారం చేసుకుని వారిని అరెస్టు చేశారు. నిరుద్యోగులను ఫోన్, ఇమెయిల్ ద్వారా శ్రీలక్ష్మి సంప్రదిస్తున్నట్లు తమకు ఫిర్యాదు అందినట్లు సైబర్ క్రైమ్ అదనపు ఎస్పీ యు. రామ్మోహన్ చెప్పారు. హైదరాబాదులోని వివిధ జాబ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ద్వారా ఓ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ 2011 జూన్‌లో రెజ్యూమ్ పంపించాడని, శ్రీలక్ష్మి అతనికి ఆఫర్ లెటర్ పంపిందని, అదే నిజమేనని నమ్మి అతను ప్రాసెసింగ్ చార్జీల కింద ఆనంద్ బ్యాంక్ ఖాతాలో 1.6 లక్షల రూపాయలు డిపాజిట్ చేశాడని, మోసం జరిగిందని అతను గ్రహించాడని ఆయన వివరించారు.

శ్రీలక్ష్మి ఇచ్చిన ఆఫర్ లెటర్‌తో సంప్రదిస్తే ఐబిఎం తాము ఇవ్వలేదని తిరస్కరించిందని ఆయన చెప్పారు. ఐబిఎం సైన్ బోర్డులున్న పూణేలోని భవనాల్లో శ్రీలక్ష్మి ఇంటర్వ్యూలు కూడా నిర్వహించినట్లు ఇన్‌స్పెక్టర్ రవికుమార్ చెప్పారు. మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

English summary
he CID cyber crime police on Friday arrested a gang of frauds for duping jobless techies with false promises of jobs in software firms like IBM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X