హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుపై తెలంగాణ చీటింగ్ కేసు కొట్టివేసిన హైకోర్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఉన్న చీటింగ్ కేసును రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు సోమవారం కొట్టివేసింది. తనపై చీటింగ్ కేసు కొట్టివేయడంతో చంద్రబాబుకు ఊరట లభించినట్లయింది. 2009 ఎన్నికలకు ముందు టిడిపి అధినేత చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని ఎన్నికలకు వెళ్లారని, ఆ తర్వాత మాట మార్చారని ఆయనపై చీటింగ్ కేసు పెట్టాలని తెలంగాణ న్యాయవాదులు గతంలో కోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ పరిగణలోకి తీసుకున్న రంగారెడ్డి జిల్లా కోర్టు చంద్రబాబుపై చీటింగ్ కేసు నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లా పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు అప్పటి నుండి నడుస్తోంది.

చంద్రబాబు వ్యక్తిగతంగా ఈ కేసులో స్థానిక కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని ఇటీవల కోర్టు తీర్పు చెప్పింది. ఆ తర్వాత చంద్రబాబు తనపై చీటింగ్ కేసు కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు సోమవారం విచారణ జరిపింది. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం కోర్టు కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పుపై తెలంగాణ న్యాయవాదులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై తాము ఈ కేసులో న్యాయం కోసం సుప్రీం కోర్టుకు వెళతామని చెప్పారు.

English summary
High Court quashes cheating case against TDP chief Nara Chandrababu Naidu today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X