హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై కేంద్రం మీద ఒత్తిడి తెస్తాం: శ్రీధర్ బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sridhar Babu
హైదరాబాద్: తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని తాము ఒత్తిడి తెస్తున్నామని రాష్ట్ర శానససభా వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్ బాబు చెప్పారు. తెలంగాణపై కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తెలంగాణపై శానససభలో తీర్మానం చేయాలనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) డిమాండుపై ఆయన స్పందిస్తూ పై విధంగా ఉన్నారు. శాసనసభ సలహా సంప్రదింపుల కమిటీ (బిఎసి) సమావేశానికి తెలుగుదేశం గైర్హాజరు కావడాన్ని ఆయన తప్పు పట్టారు. ప్రజా సమస్యలను తెలుగుదేశం పార్టీ లేవనెత్తితే తాము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. బిఎసి సమావేశానికి తెలుగుదేశం గైర్హాజరు కావడం రాజకీయ అనైతికత అని ఆయన అన్నారు.

మరోవైపు ప్రాథమిక విద్యా శాఖ మంత్రి శైలజానాథ్, చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మండిపడ్డారు. ఇలాగే ప్రవర్తిస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కదని వారు విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చంద్రబాబు రాజకీయ విశ్లేషకుడిగా మారాల్సి ఉంటుందని వారన్నారు. టక్కుటమార విద్యలతో చంద్రబాబు తెలుగుదేశంలోనే గ్రూపులు సృష్టించి ప్రభుత్వం మీదికి ఉసిగొల్పుతున్నారని వారు విమర్శించారు.

గవర్నర్ ప్రసంగ సమయంలో ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరును కాంగ్రెసు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తప్పు పట్టారు. చట్టసభలో నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ కాగితాలు చించి గవర్నర్‌పైకి విసరరడాన్ని ఎవరూ హర్షించరని ఆయన అన్నారు. గతంలో గవర్నర్ పట్ల తాము వ్యవహరించిన తీరును సమర్థించుకోవడం లేదంటూనే ప్రతిపక్షాలు నిర్మాణాత్మక పాత్ర పోషించడం లేదని ఆయన అన్నారు. గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు.

English summary
Minister D sridhar Babu said that they will put pressure on Union government on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X