విజయ సాయి రెడ్డికి షాక్: ల్యాప్‌టాప్‌కు హైకోర్టు నో

Vijaya Sai Reddy
హైదరాబాద్: జైలులో ల్యాప్‌టాప్ వాడకానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసుకున్న విజయ సాయి రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టయిన విజయ సాయి రెడ్డి జైలులో ల్యాప్ టాప్ వాడకానికి తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే, ల్యాప్ టాప్ ఇవ్వడం కుదరదని హైకోర్టు బుధవారం తేల్చి చెప్పింది. తాను చాలా కంపెనీలకు ఆర్థిక సలహాదారుగా ఉన్నందున వాటికి తగిన సలహాలు ఇవ్వడానికి జైలులో ల్యాప్‌టాప్ వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ విజయ సాయి రెడ్డి దాఖలు చేసుకున్న చేసుకున్న పిటిషన్‌ను నాంపల్లి ప్రత్యేక కోర్టు ఇటీవల కొట్టేసింది. దీంతో ఆయన హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులోనూ ఆయనకు చుక్కెదురైంది.

కాగా, ఎమ్మార్ కేసు నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ విజయరాఘవన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది. చార్జిషీట్‌లో తన పేరు లేనందున కేసు నుంచి తనకు విముక్తి కలిగించాలని కోరుతూ విజయరాఘవన్ ఆ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు సిబిఐని ఆదేశించింది. విజయ రాఘవన్‌ను సిబిఐ ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇటీవల సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్‌లో విజయ రాఘవన్ పేరును సిబిఐ చేర్చలేదు.

ఇదిలా వుంటే, తన హెలికాప్టర్‌ను ఇప్పించాలని కోరుతూ గాలి జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. ఎమ్మార్ కేసులో నిందితులను కోర్టు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. వారి జ్యుడిషియల్ రిమాండ్‌ను పొడగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోనేర్ ప్రసాద్ రిమాండ్‌ను ఈ నెల 17వ తేదీ వరకు, సునీల్ రెడ్డి, బిపి ఆచార్య, విజయ రాఘవన్ జ్యుడిషయల్ రిమాండ్‌ను ఈ నెల 22వ తేదీ వరకు పొడగించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+