చిరును ద్రోహిగా ప్రకటిస్తాం: భవానీపై దేవినేని హెచ్చరిక

Devineni Umamaheshwara Rao
హైదరాబాద్: కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని భవానీ ద్వీపం కాంట్రాక్టులను తాము వదులుకుంటున్నామని 24 గంటల్లో తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి ప్రకటించకుంటే ఆయనను కృష్ణా డెల్టా రైతాంగ ద్రోహిగా ప్రకటిస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు దేవినేని ఉమామహేశ్వర రావు, బాబూ రాజేంద్ర ప్రసాద్‌లు బుధవారం హెచ్చరించారు. ప్రకాశం బ్యారేజ్ గర్భంలో భవానీ ద్వీపం ఉందని అందులో రేపు అల్లు అరవింద్ స్టూడియో కట్టినా, భారీ హోటళ్లు పెట్టినా నీటి ప్రవాహం మళ్లుతుందని, అది బ్యారేజ్‌కే ముప్పుగా పరిమణిస్తుందన్నారు. భవానీ ద్వీపంపై ఒట్లు, ప్రమాణాల గురించి చిరంజీవి మాట్లాడుతున్నారు తప్ప దానిని వెనక్కి ఇచ్చేయడం గురించి ఒక్కమాట మాట్లాడటం లేదని అన్నారు. ఈ ద్వీపాన్ని నిజంగా పారదర్శకంగా తీసుకొని ఉంటే దాని జీవోలను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. 33 ఏళ్ల లీజులో మొదటి 28 ఏళ్లు ఏదో నామమాత్రంగా ప్రభుత్వానికి చెల్లించి చివరి ఐదేళ్లు మాత్రం భారీగా చెల్లించేలా ఒప్పందం చేసుకొన్నారు. ఆ చివరి ఐదేళ్లు ఆ డబ్బు చెల్లించకుండా చేతులెత్తేస్తే బాధ్యులు ఎవరని, ఈ మతలబులకు మద్దతు ఇచ్చిన మంత్రులు, అధికారులు చంచల్‌గూడ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని అన్నారు.

తిడితే ప్రభుత్వాన్ని తిట్టుకోండి తప్ప చిరంజీవిని అనవద్దని మంత్రి రామచంద్రయ్య అంటున్నారని, ఆయన ప్రభుత్వంలో భాగం కాదా అని విస్మయం వ్యక్తంచేశారు. తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మంత్రి రామచంద్రయ్య వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు. భవానీ ద్వీపాన్ని ధారాదత్తం చేసే జీవోను ప్రభుత్వం బహిర్గతం చేయాలని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య వేరుగా విజయవాడలో డిమాండ్ చేశారు. ఆ జీవోను ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో మారకం విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత చిరంజీవికే దక్కుతుందన్నారు. అలాంటి వ్యక్తిని రాజకీయాల్లో రైజింగ్ స్టార్ అని మంత్రి రామచంద్రయ్య పేర్కొనటం హాస్యాస్పదమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+