హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2012-2013 రాష్ట్ర బడ్జెట్ ముఖ్యాంశాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anam Ramanarayana Reddy
హైదరాబాద్: ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం గం.12.10 నిమిషాలకు సభలో 2012-2013కు గాను బడ్జెట్ ప్రవేశ పెట్టారు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా పేపర్ లేస్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఆనంకు ఇది రెండో బడ్జెట్. 2005-2006 నుంచి ఏటా లక్ష కోట్లు దాటుతున్న బడ్జెట్ ఈసారి లక్షన్నర కోట్లకు చేరింది. బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు ఆనం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్ర సగటు వృద్ధి గణనీయంగా పెరిగిందన్నారు. గత సంవత్సరం ప్రతికూల పరిస్థితుల్లోను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందన్నారు. శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు.

- రాష్ట్ర మొత్తం బడ్జెట్ - రూ.1.45 లక్షల కోట్లు
- ప్రణాళిక వ్యయం - రూ.54,030 కోట్లు
- ప్రణాళికేతర వ్య్యం - రూ.91,824 కోట్లు
- ద్రవ్య లోటు - రూ.20,008 కోట్లు
- రెవెన్యూ మిగులు - రూ.4,444 కోట్లు
- జాతీయ సగటు కన్నా రాష్ట్ర వృద్ధి రేటు అధికం, 2005 -2011 మధ్య రాష్ట్ర వృద్ధి రేటు 9.26 శాతం
- కరవు సాయంగా కేంద్రాన్ని రూ.3500 కోట్లు కోరినట్లు చెప్పారు
- రూ.1 కిలో బియ్యం ద్వారా 2.25 కోట్ల మందికి లబ్ధి
- రాజీవ్ యువకిరణాలు పథకం ద్వారా 2014 లోగా 15 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు
- జాతీయ విపత్తు పద్దు కింద రూ.246 కోట్లు
- రైతులు, స్వయం సహాయక బృందాలకు రూ.1075 కోట్ల వడ్డీ లేని రుణాలు
- ఆదాయ వనరుల సమీకరణ బాగా పెంచాం
- సాంఘీ సంక్షేమానికి రూ.2677 కోట్లు
- గిరిజన సంక్షేమానికి రూ. 2283 కోట్లు
- ఆర్ అండ్ బి రూ.5032 కోట్లు
- పశు సంవర్ధక శాఖకు రూ.1106 కోట్లు
- ఐటికి రూ.150 కోట్లు
- విద్యుత్ కు రూ.5937 కోట్లు
-సాంకేతిక విద్య రూ.1087 కోట్లు
- బిసి సంక్షేమం రూ.3014 కోట్లు
- వికలాంగుల సంక్షేమం రూ.66 కోట్లు
- క్రీడలు రూ.220 కోట్లు
- సాధారణ పరిపాలన రూ.88 కోట్లు
- రాజీవ్ యువకిరణాలు రూ.18041 కోట్లు
- గ్రామీణాభివృద్ధికి రూ.4700 కోట్లు
- విద్యుత్‌కు రూ. 5937 కోట్లు
- మైనారిటీకి రూ.489 కోట్లు
- మహిళా సంక్షేమం రూ.2283 కోట్లు
- సాంకేతిక విద్య - రూ.1087 కోట్లు
- గృహ నిర్మాణం - రూ.2302 కోట్లు
- క్రీడలు రూ.220 కోట్లు
- ఆరోగ్య శాఖ - రూ.5040 కోట్లు
- గ్రామీణ, నగర స్థానిక వికేంద్రీకరణ - రూ.675 కోట్లు
- రవాణా శాఖకు - రూ.5032 కోట్లు
- పాల మిషన్‌కు - రూ.100 కోట్లు
- పట్టణాభివృద్ధికి రూ.6586 కోట్లు
- విద్య - రూ.5937 కోట్లు
- బిసి సంక్షేమం - రూ.3014కోట్లు
- రాజీవ్ యువకిరణాలు రూ.777 కోట్లు
- పశు సంవర్ధరం - రూ.1106 కోట్లు
- కార్మిక శాఖ - రూ.500 కోట్లు
- శాంతి భద్రతలు - రూ.4832 కోట్లు
- సాధారణ పరిపాలన - రూ.88 కోట్లు
- పౌర సరఫరాలు - రూ.3175 కోట్లు
- గిరిజన శాఖ - రూ.2283 కోట్లు
- వ్యవసాయం - రూ.3175 కోట్లు
- ఇరిగేషన్ - రూ.15010 కోట్లు
- స్ర్తీ నిధి - రూ.100 కోట్లు
- పట్టు పరిశ్రమకు రూ.188 కోట్లు
- ఇందిర జల ప్రభ కింద లక్ష బోరు బావులు - రూ.1800 కోట్లు
- స్ర్తీ జనశక్తి భవనం ఒక్కోదానికి రూ.25 లక్షలు
- వెనుకబడిన తరగతులకు రూ.3014 కోట్లు
- రాష్ట్ర విపత్తు నిధి - రూ.460 కోట్లు
- మత్సకారుల భీమా - రూ.234 కోట్లు
- పేద రైతులకు 42 వేల పశువులు పంపిణీ
- హోంశాఖకు రూ.4832 కోట్లు
- ఎస్సీ వెల్పేర్ రూ.2677 కోట్లు
- తీర ప్రాంతల వసతుల కల్పన - రూ.25 కోట్లు
- ఆర్టీసిలో కొత్తగా 6వేల బస్సులు
- చేనేత రుణాల రద్దు - రూ.159 కోట్లు
- పర్యాటక, సాంస్కృతిక, క్రీడల - రూ.280 కోట్లు
- పారిశ్రామికాభివృద్ధి 7.11 శాతం
- పరిశ్రమలు - రూ.633 కోట్లు
- విపత్తు నిర్వహణకు - రూ.560.9 కోట్లు
- రైతులకు రూ.లక్ష వరకు వడ్డీ లేని రుణాలు
- 97.3 లక్షల ఎకరాలకు సాగునీరు
- అకౌంట్లలో నేరుగా నిరుద్యోగ భృతి

- గోదావరిపై రెండో వంతెనకు - రూ.808 కోట్లు

English summary
Minister Anam Ramanarayana Reddy proposed 2012-2013 budget on friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X