సంకెళ్లతో బస్తాలు మోసి జెపి నిరసన, పాదయాత్ర

ఎక్కడ పండిన పంటను అక్కడే అమ్ముకునే అవకాశం రైతులకు ఉండాలని ఆయన అన్నారు. పండించిన పంటను అమ్ముకోవడానికి ఆంక్షలు పెట్టడం సరి కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం చేసిన పాపాల వల్ల రెండేళ్లలో ఎరువుల ధఱలు రెండింతలు పెరిగాయని ఆయన విమర్శించారు. గిట్టుబాటు ధరలు సగానికి పడిపోయాయని ఆయన అన్నారు. జెపి యాత్రకు కాంగ్రెసు నాయకుడు రుద్రగౌడ్ మద్దతు తెలిపారు. రైతుల కోసం జైలుకు వెళ్లడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. రైతుల కోసం ఎవరు మద్దతిచ్చినా తీసుకుంటానని ఆయన చెప్పారు. తన యాత్రను తెలుగుదేశంశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి రైతు పోరుబాటతో పోల్చుకోలేనని ఆయన అన్నారు.