వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాణం తీసిన ఇయర్‌ ఫోన్స్!, పట్టాలు దాటుతుండగా..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Train Accedent in Bangalore
బెంగళూరు: ఇయర్ ఫోన్స్ ఓ విద్యార్థి ప్రాణాల మీదకు తీసుకు వచ్చిన సంఘటన కర్నాటకలో చోటు చేసుకుంది. పుష్పక్ నాగరాజు అనే విద్యార్థి బెంగళూరులోని సౌత్ ఎండ్ సర్కిల్ జయనగర్‌లోని సురన కళాశాలలో బిసిఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం ఇతను చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన ట్రెయిన్ ఢీకొనడంతో మృతి చెందాడు. మృతుడు కెంగేరి శాటిలైట్ టౌన్ నివాసి. ఇతను తన నానమ్మ ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

పుష్పక్ చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పట్టాలు దాటుతుండగా మైసూర్ - బెంగళూరు ఎక్స్ ప్రెస్ వేగంగా వచ్చి అతనిని గుద్దింది. అతని తల పగిలింది. అతను పట్టాలు దాటుతుండగా వేగంగా వస్తున్న రైలును చూసి అక్కడే ఉన్న ప్రయాణీకులు అతనిని హెచ్చరించారు. రైలు వస్తుందంటూ అరిచారు. కానీ దురదృష్టవశాత్తు అతని చెవిలో ఇయర్ ఫోన్స్ ఉన్నందు వల్ల వారి హెచ్చరికలు అతనికి వినపడలేదు. ప్రమాదానికి గురైన పుష్పక్‌ను వెంటనే కెంగేరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ డాక్టర్లు అప్పటికే అతను మృతి చెందినట్లుగా చెప్పారు.

పుష్పక్ కన్నడ పాటలను బాగా ఇష్టపడతాడని, ప్రత్యేకంగా డాక్టర్ రాజ్ కుమార్, పిబి శ్రీనివాస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలను ఇష్ట పడతాడని, ఇటీవలె రెండు వందల పాటలను తన మెమొరికార్డులో నింపి మొబైల్‌లో వేశాడని మృతుడి బంధువు ఒకరు చెప్పారు.

English summary
Pushpak Nagaraj, a BCA first year student, Surana College, Jayanagar South End Circle, died after he was mowed down by a speeding train.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X