హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణను కాంగ్రెసే పరిష్కరిస్తుంది:సిఎం, ప్రచారానికి సై

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: తెలంగాణ అంశంపై కాంగ్రెసు పార్టీ ఒక్కటే నిర్ణయం తీసుకోగలుగుతుందని ఇతర పార్టీలకు అది సాధ్యం కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం సాయంత్రం అన్నారు. క్యాంపు కార్యాలయంలో కామారెడ్డి నియోజకవర్గం కాంగ్రెసు కార్యకర్తలు, నాయకులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణపై కేంద్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కామారెడ్డిలో అధిష్టానం నిర్ణయించే అభ్యర్థిని గెలిపించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. తెలంగాణ ప్రాంతంలో 16 లక్షల ఎకరాల భూములను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన ప్రాణహిత - చేవెళ్ల ముఖ్యమైన ప్రాజెక్టు అని, త్వరలో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. రూపాయికి కిలో బియ్యం పథకం 99 శాతం మందికి తెలిసినట్లుగా ఒక సర్వేలో వెల్లడైందన్నారు. రైతులు, మహిళలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల గురించి కేవలం 50-60 శాతం మందికి మాత్రమే తెలిసిందని చెప్పారు. ప్రభుత్వ పథకాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు నిచ్చారు. ఈ ఒక్క ఏడాదిలోనే 1.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియ చురుకుగా సాగుతోందన్నారు. మనం ఐక్యంగా ముందుకెళితే ఉప ఎన్నికల్లో ఓడించే వారు ఉండరని ఆయన అన్నారు. తాను ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు.

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నాయని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. అభ్యర్థి ఎవరు ఏమిటన్నది పక్కన పెడితే నాయకుడికి గెలుపు, ఓటమి ముఖ్యం కాదన్నారు. షబ్బీర్ అలీకి ప్రజల్లో ఎంతో ఆదరణ ఉందన్నారు. పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి షబ్బీర్ అలీని పోటీకి దించాలని పార్టీ భావిస్తుండగా ఆయన విముఖత చూపుతున్నారని సమాచారం. అయితే ఓడినా తనకు న్యాయం జరుగుతుందని భావిస్తే పోటీ చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారట. నియోజకవర్గ ప్రజలు కూడా షబ్బీర్ అలీనే సూచించారని సమాచారం.

English summary
CM Kiran Kumar Reddy said that only Congress party will take decision on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X