కాన్పూర్: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కాన్పూరులో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా అనుమతించిన రూటులో కాకుండా మరో రూటులో ఎన్నికల ర్యాలీ నిర్వహించినందుకు ఆయనపై ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. రాహుల్ గాంధీ రోడ్ షోకు జిల్లా అధికార యంత్రాంగం మధ్యాహ్నం 12 గంటల వరకు 20 కిలోమీటర్ల అనుమతించారు. శివరాత్రి కావడంతో అధికారులు ఈ ఆంక్షలు పెట్టారు.
అయితే రాహుల్ గాంధీ రోడ్డు షో నిబంధనలను ఉల్లంఘిస్తూ ఉదయం పది గంటలకు ప్రారంభమైన సాయంత్రం మూడు గంటల వరకు సాగింది. అనుమతించిన మార్గంలో కాకుండా 38 కిలో మీటర్ల మేర ఆయన రోడ్ షో సాగింది. అందువల్ల రాహుల్‌పై కేసు పెట్టామని జిల్లా మెజిస్ట్రేట్ హరి ఓం చెప్పారు. మరో 39 మందిపై కూడా కేసు నమోదు చేశారు.
Congress general secretary Rahul Gandhi grabbed the headline for his involvement in a fresh controversy as his roadshow in Kanpur on Monday, Feb 20 have allegedly breached the approved road map.
Story first published: Monday, February 20, 2012, 22:15 [IST]