ప్రముఖ నటి ఎస్ఎన్ లక్ష్మి గుండెపోటుతో కన్నుమూత

చిన్నతనంలోనే రంగస్థల నటిగా రాణించి, 13 ఏళ్ల ప్రాయంలో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన లక్ష్మి ఐదు దశాబ్ధాలుగా తమిళ సినీ పరిశ్రమకు సేవలందించారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిన తరువాత పలు సీరియల్స్‌లో నటించారు. ఆమె భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్ధం సాలిగ్రామంలోని ఆమె ఇంట్లో వుంచారు. మంగళవారం ఉదయం ఆమె స్వగ్రామమైన విరుదునగర్ జిల్లాలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఎన్ఎన్ లక్ష్మి మరణవార్త తెలియగానే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తన చిత్రాల్లో కూడా లక్ష్మి నటించారని, ఆమె లేకపోవడం సినీ పరిశ్రమకి తీరని లోటని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications