ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై రభస: స్తంభించిన అసెంబ్లీ

స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని గొడవ చేయడం హుందాతనం కాదని ముఖ్యమంత్రి తెలుగుదేశం సభ్యులను ఉద్దేశించి అన్నారు. తెలుగదేశం సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. చంద్రబాబుకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని తెలుగుదేశం సభ్యులు పట్టుబట్టారు. ఈ సమయంలో శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జోక్యం చేసుకుని - వివరణ పేరుతో చంద్రబాబు గంటల తరబడి ప్రసంగిస్తున్నారని ఆయన అన్నారు. చేతులు పెట్టి తెలుగదేశం సభ్యులు బెదిరిస్తున్నారని, స్పీకర్‌పై లేనిపోని అభియోగాలు మోపుతున్నారని, ఇది సభాడ సంప్రదాయం కాదని అన్నారు.
ముఖ్యమంత్రి ప్రసంగం ముగిసిన తర్వాత చంద్రబాబు వివరణ కోరవచ్చునని, అప్పుడు ముఖ్యమంత్రి సమాధానం ఇస్తారని, ఇప్పుడు సభా కార్యక్రమాలను తెలుగుదేశం సభ్యులు సాగనివ్వాలని ఆయన అన్నారు. స్పీకర్ ఎంతగా చెప్పినా తెలుగుదేశం సభ్యులు వినలేదు.












Click it and Unblock the Notifications