అమ్మాయితోనే పెళ్లి, బెదిరింపులు: తెలుగు అమ్మాయి

తమ పెళ్లికి అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని తెలుగు అమ్మాయి ఒరిస్సాకు చెందిన అమ్మాయి తల్లిదండ్రులను బెదిరించినట్లు తెలుస్తోంది. మరో అమ్మాయి తల్లిదండ్రులను బెదిరించినందున తెలుగు అమ్మాయిని అదుపోలికి తీసుకున్నామని బెహ్రంపూర్ పోలీసులు చెప్పారు. తెలుగు అమ్మాయి బెహ్రంపూర్‌లోని అమ్మాయి ఇంటికి వచ్చి గొడవ చేసిందని, తాము ఆ అమ్మాయిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.
హైదరాబాదులోని ఓ హాస్టల్ గదిలో ఉన్నప్పుడు ఇద్దరు అమ్మాయిల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. రెండేళ్ల క్రితం వారిద్దరు కంప్యూటర్ కోర్సు పూర్తి చేశారు. ఆ తర్వాత కూడా ఇద్దరూ కలుసుకుంటూ వస్తున్నారు. ఒరిస్సా అమ్మాయికి పెళ్లి నిశ్చయం కావడంతో తెలుగు అమ్మాయికి కోపం వచ్చింది. దీంతో గొడవ చేసింది.