హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నా అరెస్టు అక్రమం: విజయ రాఘవ పిటిషన్ దాఖలు

By Pratap
|
Google Oneindia TeluguNews

EMAAR Properties
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఎంజిఎఫ్ ధికారి విజయ రాఘవ సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. తన అరెస్టు అక్రమమని ఆయన ఆ పిటిషన్‌లో అన్నారు. తనకు ఏ మాత్రం సంబంధం లేని కేసులో సిబిఐ తనను అరెస్టు చేసిందని అంటూ ఆ అరెస్టు రద్దు చేయాలని ఆయన హైకోర్టును కోరారు. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు సిబిఐని ఆదేశించింది. విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది.

సిబిఐ కోరిన అన్ని వివరాలను తాము అందించామని, సిబిఐ కోరిన వివరాలను అందించడానికి తాము ఇప్పటికీ సిద్ధంగా ఉన్నామని విజయరాఘవ తరఫు న్యాయవాదులు అంతుకు ముందు కోర్టుకు చెప్పారు. విచారణకు తాము సహకరిస్తున్నా చట్టానికి అతీతంగా సిబిఐ వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. చట్టానికి అతీతంగా వ్యవహరించి విజయ రాఘవను అరెస్టు చేసినట్లు వారు ఆరోపించారు.

English summary
MGF officer Vijaya raghava filed petition in High Court challenging his arrest in EMAAR case by CBI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X