చిరంజీవిని ఎఐసిసి చూసుకుంటుంది: బొత్స సత్తిబాబు

Botsa Satyanarayana
ఏలూరు: చిరంజీవికి రాజ్యసభ సీటు ఇచ్చే విషయాన్ని తమ ఎఐసిసి చూసుకుంటుందని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన శనివారం రోడ్ షో నిర్వహించారు. అకివీడు నుంచి ఆయన రోడ్ షో ప్రారంభించారు. అంతకు ముందు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తనకు ఏ విధమైన విభేదాలు లేవని ఆయన స్పషటం చేశారు. ఉప ఎన్నికలను తాము ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామని, తమను ఉప ఎన్నికల్లో గెలిపిస్తే మెరుగైన కార్యక్రమాలు చేపడుతామని ఆయన అన్నారు. అనర్హత వేటు వల్ల ఖాళీ అయిన 17 స్థానాలను తాము నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని, అందుకు అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఆయన అన్నారు. పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు పోతామని ఆయన చెప్పారు.

రైతులకు గిట్టుబాట ధర లభించడం లేదనే ప్రతిపక్షాల విమర్శలను ఆయన తిప్పికొట్టారు. సోనియా గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేశారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ముఖ్యమంత్రి సీటు తనకు కావాలని అడుగుతున్నాడని ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రాంతీయ పార్టీల హవా పెరిగిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంబరపడుతున్నారని, నిజానికి జాతీయ పార్టీల సీట్లే మారాయని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ రేసులో ముందుందని ఆయన అన్నారు. రాజ్యసభ ఎన్నికల కోసం తాము 25 మంది పేర్లను పార్టీ అధిష్టానానికి పంపినట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+