గుంటూరు: గుంటూరు జిల్లాలోని ఓ పాఠశాలలో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన లెక్కల మాస్టారుకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. గుంటూరు జిల్లా దేవేంద్రపాడు గ్రామంలో లెక్కలు చెప్పే ఉపాధ్యాయుడు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని గ్రామస్తులు ఆరోపించారు. బాలికలతో అసభ్యంగా మాట్లాడేవాడని, అసభ్యంగా ప్రవర్తించేవాడని, దాన్ని భరించలేక పిల్లలు తమకు చెప్పారని గ్రామస్తులు అంటున్నారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేస్తే, లెక్కల టీచర్ పాఠశాలకు రావడం లేదని, వచ్చాక వివరణ అడుగుతానని ప్రిన్సిపాల్ చెప్పారు.
వాసుదేవ రావు అనే లెక్కల మాస్టారు శనివారం పాఠశాలకు వచ్చాడని తెలుసకున్న గ్రామ ప్రజలు వచ్చి ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని లెక్కల మాస్టారును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.