నేతాజీ జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో పనిచేస్తారు: అఖిలేష్

Akhilesh Yadav
లక్నో: తన తండ్రి నేతాజీ జాతీయ రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ ఉంటారని కాబోయే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పారు. ఎస్పీ శానససభా పక్ష నేతగా ఎన్నికైన తర్వాత ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తమకు ములాయం సింగ్ ఆశీస్సులు అవసరమని ఆయన అన్నారు. రాష్ట్రాభివృద్ధికి నిజాయితీతో పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తమ పార్టీకి మెజారిటీ ఇచ్చిన ప్రజలకు, కులమతాలకు అతీతంగా వ్యవహరించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచిన హామీలను తాము అమలు చేస్తామని ఆయన చెప్పారు

ఎవరిపైనా కక్ష తీర్చుకునే పద్ధతి ఉండదని ఆయన అన్నారు. బిఎస్పీ నేత మాయావతిని ఉద్దేశించి ఆయన ఈ మాటలన్నారు. చూడడానికి ఎవరు వెళ్లినా వెళ్లకపోయినా మాయావతి విగ్రహాలు అలాగే ఉంటాయని, ఖాళీ స్థలాన్ని విద్యా సంస్థలకు, ఆస్పత్రులకు వాడుకుంటామని ఆయన చెప్పారు. తనను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్న శాసనసభ్యులకు ఆయన కృతజ్ఢతలు చెప్పారు. తాను ఈ నెల 15వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తానని, వేదికను తర్వాత ప్రకటిస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+