జగన్ చేతుల్లోనే అంతా..! నెరవేరని ముద్రగడ కోరికపై కాకినాడ ఎంపీ..!

అనారోగ్యంతో మొన్న కన్నుమూసిన ఏపీ మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (mudragada padmanabham) అంత్యక్రియలు నిన్న పూర్తయ్యాయి. 24 గంటల్లోనే ముద్రగడ కేంద్రంగా రాజకీయ పార్టీల మాటల తూటాలు మొదలైపోయాయి. నిన్న ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలకు హాజరైన జగన్(ys jagan).. ఆయన పాడె కూడా మోశారు. దీన్ని వైఎస్సార్సీపీ నేతలు గొప్పగా చెప్పుకుంటుండగా.. మిగతా విషయాల్లో జగన్ ను కూటమి పార్టీలు టార్గెట్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో కాకినాడ ఎంపీ, జనసేన నేత ఉదయ్ శ్రీనివాస్ (uday srinivas) ఇవాళ స్పందించారు.

కాపు ముఖ్యమంత్రి కావాలన్న ముద్రగడ పద్మనాభం జీవితకాల ఆకాంక్షను నెరవేర్చే అవకాశం ఇప్పుడు వై.ఎస్.జగన్ చేతుల్లోనే ఉందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. సీఎం బొత్స సత్యనారాయణ గారినా?, సీఎం పేర్ని నాని గారినా? సీఎం అంబటి రాంబాబు గారినా?, సీఎం గుడివాడ అమర్‌నాథ్ గారినా? వీరిలో ఎవరినైనా సీఎంగా చేసి, ముద్రగడ గారి జీవితకాల స్వప్నాన్ని సాకారం చేసి, ఆయన ఆత్మకు నిజమైన నివాళి అర్పిస్తారని ఆశిస్తున్నానని ఉదయ్ ట్వీట్ చేశారు.

Kakinada MP Uday Srinivas demands to YS Jagan to Fulfil Mudragada Padmanabham s Final Wish

ముద్రగడ వైఎస్సార్సీపీలో ఉంటూనే చనిపోవడంతో ఆయన అంత్యక్రియలకు హాజరైన జగన్, కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు. ముద్రగడ వారసుడైన కుమారుడు గిరిని ఇప్పటికే వైఎస్సార్సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ చార్జ్ గా కూడా నియమించింది. అయితే కాపులకు రిజర్వేషన్ కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభం, అదే కాపులకు సీఎం కావాలని మాత్రం పెద్దగా గొంతెత్తిన సందర్భాలు లేవు. అయినా ముద్రగడను అడ్డుపెట్టి జగన్ ను టార్గెట్ చేసేందుకే కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఈ ట్వీట్ పెట్టారన్న చర్చ జరుగుతోంది. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు స్పందించాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+