ఓటీటీలోకి బుర్రపాడు చేసే మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..!

సాధారణంగా క్రైమ్ సినిమాలు చూసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. రెగ్యూలర్, కమర్షియల్ సినిమాలు చూసి బోర్ కొట్టిన ప్రేక్షకులు హార్రర్, థ్రిల్లర్ సినిమాలను చూసేందుకు ఇష్టపడుతుంటారు. ఇలాంటి సినిమాలు మలయాళంలోనే ఎక్కువగా వస్తుంటాయి. భాష అర్థం కాకపోయినా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూస్తుంటారు తెలుగు ప్రేక్షకులు. అయితే వారికోసం ఇప్పుడు మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చింది. అదే 'అన్వేషిప్పిన్ కండేతుమ్' ఈ మూవీ అక్కడ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసింది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ మూవీ పండగనే చెప్పాలి.

అన్వేషిప్పిన్ కండేతుమ్ సినిమా కేరళలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. అందువల్ల ఈ మూవీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేక్షకులను ఆలోచింపజేసే కథతో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఓటీటీలో ఈ మూవీ ఒరిజినల్ మలయాళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు టాప్ రేటింగ్ ఉండడంతో ఈ మూవీపై ఆసక్తి మరింత పెరిగింది. ఇక మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చాక కూడా అద్భుతమైన రెస్పాన్స్ ను దక్కించుకుంది.

ఈ మూవీలో నిజాయితీ కలిగిన పోలీస్ అధికారిగా టోవినో నటన అద్భుతం అనే చెప్పాలి. ఒక యువతి మిస్సింగ్ కేసు, మరో యువతి హత్య కేసు మధ్య ఉన్న షాకింగ్ లింక్ కథను మరింత ఉత్కంఠగా మారుస్తుంది. ప్రతి ట్విస్ట్ ప్రేక్షకులను చివరి వరకు సస్పెన్స్‌ లో ఉంచుతుంది. ఇలాంటి క్రైమ్ స్టోరీస్ చాలా అరుదుగా వస్తుంటాయి. ఈ చిత్రానికి డార్విన్ కురియకోస్ దర్శకత్వం వహించారు.

Malayalam crime thriller Anweshippin Kandethum arrives on OTT streaming in Telugu as well watch

అలాగే ఈ మూవీలో వినీత్ డేవిడ్, సిద్దిఖీ, షమ్మి తిలకన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఎమోషనల్ డ్రామా, ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు సినిమాను మరింతగా రక్తి కట్టిస్తాయి. అటు ఐఎండీబీలోనూ ఈ మూవీకి మంచి రేటింగ్ ఉండటం విశేషం. ఇక ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ ఫ్లిక్స్‌ లో మలయాళంతో పాటు తెలుగు భాషలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. వెంటనే ఈ మూవీని చూసేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+