తెలంగాణ ఇస్తామనలేదు, జగన్ వల్లే బైపోల్స్: బొత్స

Botsa Satyanarayana
ఏలూరు: కడప ఎంపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి, అహంకారం వల్లే రాష్ట్రంలో రెండు మూడు నెలల్లోనే మరో మారు ఉప ఎన్నికలకు దిగాల్సి వచ్చిందని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అధికారం మాటున అడ్డగోలుగా సంపాదించి, అహంకారంతో విర్రవీగుతూ ర్రాష్టంలో అవినీతిని పెంచి పోషించేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని, ప్రజలు ఈ విషయమై జాగ్రత్త వహించాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ఇస్తామని ఆజాద్ ఎప్పుడూ చెప్పలేదని, ఎన్నికలు పూర్తయిన తర్వాత దాని విషయం ఆలోచిస్తామని మాత్రమే చెప్పారని బొత్స స్పష్టం చేశారు. దీనిపై ఎలాంటి అస్పష్టతలు సృష్టించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ స్థానంలో శనివారం ఆయన రోడ్‌షో నిర్వహించడంతోపాటు పలుచోట్ల బహిరంగ సభల్లోనూ మాట్లాడారు. పశ్చిమ పర్యటనలో బొత్సకు అన్నిచోట్లా ఘన స్వాగతం లభించింది. నరసాపురంలో జరిగిన బహిరంగ సభకు వేలాదిమంది హాజరయ్యారు. ఈ సందర్భంగా, జగన్, చంద్రబాబుపై ఆయన దుమ్మెత్తిపోశారు.

రాష్టంలో కాంగ్రెస్‌ను పూర్తిగా పటిష్ఠపరచాలని తాను, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కంకణం కట్టుకున్నామన్నారు. దివంగత వైయస్ ఇందిరమ్మ రాజ్యం అంటే ఆయన తనయుడు మాత్రం దండిగా సంపాదించారని, ఇప్పుడు మరోమారు అవినీతికి బార్లా తలుపులు తెరచి రాష్టంలో అధికారం పొందాలని తహతహలాడుతున్నారని విమర్శించారు. జగన్ అహంకారం, అవినీతి వల్లే వచ్చే రెండుమూడు నెలల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి. ఇలాంటి వారికి అధికారం అప్పగిస్తే రాష్టమంతా అల్లకల్లోలమేనన్నారు. వచ్చే ఉప ఎన్నికల్లో నీతికి, అవినీతికి మధ్యే పోటీ జరగబోతుందన్నారు. టిడిపి అధినేత చంద్రబాబుపైనా ఆయన నిప్పులు చెరిగారు. రెండెకరాల ఆసామి రెండు వేల కోట్లకు యజమాని ఎలా అయ్యాడో చెప్పాలన్నారు. ఆయనో అవినీతి చక్రవర్తి అని, అవినీతిపై కేసులు నమోదైన ప్రతిసారి స్టే తెచ్చుకుంటారని ఎద్దేవా చేశారు. కోర్టులపై నమ్మకం ఉందంటూనే ఇలా స్టేలకు తెగబడతారని, నీతి, నిజాయతీ ఉంటే స్టేలను ఉపసంహరించుకుని తన నిజాయతీ ఏపాటిదో నిరూపించుకోవాలని బొత్స సవాల్ చేశారు.

తొమ్మిదేళ్ల పాలనలో రైతులను విస్మరించి ఇప్పుడు రైతులపై ఎనలేని ప్రేమ చూపుతూ మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఉప ఎన్నికల్లో టీడీపీకి రెండో స్థానం కూడా దక్కే పరిస్థితి లేదన్నారు. ఏడు చోట్లా తమ పార్టీకి విజయావకాశాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. చిరంజీవిని రాజ్యసభకు పంపే విషయంలో అధిష్ఠానం తుది నిర్ణయం ప్రకటిస్తుందని, కాంగ్రెస్‌లో చిరంజీవికి అన్ని విధాలా ప్రాధాన్యం లభించి తీరుతుందని స్పష్టం చేశారు. కొందరు మద్యం వ్యాపారులు తమ లైసెన్సులను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్న విషయం మీకు తెలుసా అని ప్రశ్నించగా.. అలాంటిదేమీ తనకు తెలియదని చెప్పారు. ధాన్యం మద్దతు ధర, బోనస్ విషయంలో కేంద్రం కొంత జాప్యం చేస్తే ర్రాష్ట ప్రభుత్వమే బోనస్ ప్రకటించి ఆ మొత్తాన్ని భరించడానికి సిద్ధంగా ఉందని పలు సభల్లో ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+