హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉప ఎన్నికల ఎఫెక్ట్ : ఎమ్మెల్యేలు లేక అసెంబ్లీ వెలవెల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న ఏడు నియోజకవర్గాల ఉప ఎన్నికల ప్రభావం అసెంబ్లీపై పడింది. సోమవారం అసెంబ్లీ శాసనసభ్యులు లేక వెలవెల పోయింది. విధానసభలో కుర్చీలు ఖాళీగా కనిపించాయి. ఉప ఎన్నికల సమయం దగ్గర పడటంతో ప్రచార కార్యక్రమాల్లో నేతలు ఉన్నందునే ఈ ప్రభావం పడిందని చెబుతున్నారు. అధికార, విపక్ష పార్టీ నేతలు లేక అసెంబ్లీ పలుచగా కనిపించింది. సభలో ప్రభుత్వం తీరును నిరసిస్తూ తాము వచ్చే 18 వరకు అసెంబ్లీకి రామని టిఆర్ఎస్ గతంలోనే స్పష్టం చేశాయి. ఇక మిగిలిన పార్టీలు ప్రచారంలో తలమునకలయ్యాయి. నేతలు సమావేశాలకు రాకపోయినప్పపటికీ అసెంబ్లీ లాబీల్లో తిరుగుతుండేవారు. కాని ఇప్పుడు అక్కడా ఎవరూ కనిపించడం లేదు. శాసనసభ్యుడు, కాంగ్రెసు నేత చిరంజీవి ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలోని కొవూరు ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. కాగా అంతకుముందు సభ ప్రారంభం కాగానే విపక్షాలు ఇచ్చిన తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. దీంతో తీర్మానాలపై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీ విలీన ప్రక్రియను కూడా స్పీకర్ అసెంబ్లీలో అధికారికంగా ఉదయం ప్రకటించారు.

కాగా తాగునీటి సమస్యపై సభ రసాభాసగా మారింది. తాగునీటి సమస్యపై విపక్షాలు అధికార పక్షాన్ని నిలదీశాయి. 2014 చివరి నాటికి కృష్ణా మూడోదశ ద్వారా హైదరాబాదుకు తాగునీరు అందిస్తామని పురపాలక సంఘ మంత్రి మహీధర్ రెడ్డి సభలో ప్రకటించారు. 2017 నాటికి గోదావరి నుంచి హైదరాబాదుకు తాగునీరు అందిస్తామన్నారు. నగరంలో వాల్టా చట్టాన్ని అమలుకు టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మంత్రి సమాధానంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. తాగునీటి సరఫరా దారుణంగా ఉన్నా మంత్రి మభ్యపెడుతున్నారని విపక్షాలు విమర్శించాయి. ఉద్యమాలు చేస్తే కానీ నీళ్లు ఇచ్చేలా లేరని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ప్రభుత్వం వివరణపై ఎంఐఎం అసంతృప్తి వ్యక్తం చేసింది. హైదరాబాదుకు మంచినీటి సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బిజెపి వాకౌట్ చేసింది.

English summary
By Polls affect: No MLAs in Assembly
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X