హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇడుపులపాయ నేలమాళిగలో జగన్‌కు కోట్లు: దేవినేని

By Srinivas
|
Google Oneindia TeluguNews

Payyavula Keshav-Devineni Umamaheswara Rao
హైదరాబాద్: ఇడుపులపాయ నేలమాళిగల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలు దాచిపెట్టారని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వర రావు సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవూరు ఉప ఎన్నికల్లో వంద కోట్లు పంచేందుకు జగన్ సిద్ధమయ్యారన్నారు. ఓటుకు రూ.ఐదువేల చొప్పున ఇచ్చే అవకాశముందన్నారు. ఇడుపులపాయ నేలమాలిగ నుండి ఇసుక లారీలు, ఆయిల్ ట్యాంకర్లలో డబ్బులు తరలిస్తున్నారని ఆరోపించారు. జగన్ ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు నోటీసులు అందుకున్న మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రులకు సిగ్గుంటే, నీతి నియమాలు ఉంటే వెంటనే స్వయంగా తప్పుకోవాలన్నారు. ఇప్పటికి ఆరుగురు దొంగలు బయటపడ్డారన్నారు. అధికార కాంగ్రెసు ఏడేళ్లుగా రాష్ట్రాన్ని దోచుకుంటుందన్నారు. దీనిపై టిడిపి పోరాటం చేస్తుందన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో ఉన్న వారంతా కళంకిత మంత్రులేనని పయ్యావుల కేశవ్ మీడియా పాయింట్ వద్ద అన్నారు. ఇదే విషయాన్ని తాము మొదటి నుండి చెబుతున్నామన్నారు. నోటీసులు అందుకున్న మంత్రులు వెంటనే తప్పుకోవాలని లేదా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వారిని స్వయంగా తప్పించాలని డిమాండ్ చేశారు. వైయస్ తాను తింటూ మంత్రులకు తినిపించారన్నారు. నోటీసులు అందుకున్న మంత్రులే కాకుండా మరికొందరు కూడా ఉన్నారని, వారి పైనా చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఐదేళ్ల కాలంలో కాంగ్రెసు భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడిందన్నారు. ఇప్పుడు కూడా అదే అవినీతి ఇప్పటి ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. నిందితులు చంచల్ గూడ జైలుకు వెళ్లక తప్పదన్నారు.

సుప్రీం కోర్టు నోటీసుల పాపం జగన్మోహన్ రెడ్డిదేనని కోడెల శివప్రసాద్ అన్నారు. ఐఏఎస్ అధికారులు జైలుకెళ్లడానికి కారణం ఆయనే అన్నారు. జగన్ ఒత్తిడి కారణంగానే అక్రమ జివోలు జారీ చేశారని ఆరోపించారు. నోటీసులు అందుకున్న మంత్రులను ముఖ్యమంత్రి వెంటనే మంత్రివర్గం బర్తరఫ్ చేయాలని కెఇ కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. వారు ఫైళ్లను మాయం చేసే అవకాశముందన్నారు.

English summary
TDP senior leader Devineni Umamaheswara Rao blamed YS Jaganmohan Reddy for Supreme Court notices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X