తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజ్యసభపై సంకేతాలు లేవు: చిరు, బైపోల్స్‌పై అసంతృప్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
తిరుపతి: అనవసరంగా ఉప ఎన్నికలు వచ్చాయని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని తిరుపతి శాసనసభ్యుడు, కాంగ్రెసు పార్టీ నేత చిరంజీవి సోమవారం అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకే విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవూరు నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు తాను వచ్చినట్టు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమమే ప్రధానం అంశంగా తాను ప్రచారం చేస్తానని అన్నారు. అవే తమ పార్టీ అజెండా అన్నారు. ఉప ఎన్నికలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన అన్నారు. పదే పదే ఉప ఎన్నికలు రావడం వారిని ఆవేదనకు గురి చేస్తోందన్నారు.

తనకు రాజ్యసభ స్థానంపై అధిష్టానం నుండి ఎలాంటి సంకేతాలు లేవని ఆయన స్పష్టం చేశారు. తనకు పదవి ఇచ్చినా ఇవ్వక పోయినా అధిష్టానం నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. కాగా ఇటీవల చిరంజీవికి రాజ్యసభ సీటు దాదాపు ఖరారయిందనే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. కాగా ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనమైనట్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ సోమవారం అధికారికంగా ప్రకటించారు.

English summary
Tirupati MLA Chiranjeevi said that he has no indications about Rajyasabha seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X