మాయ ఆస్తులు రూ. 111 కోట్లు, 380 క్యారట్ల వజ్రాలు

ఆమె స్థిరాస్తుల విలువ రూ. 96 కోట్ల మేరకు ఉంటుంది. ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో రెండు దుకాణాలున్నాయి. సర్దార్ పటేల్ మార్గ్‌లో రూ. 62 కోట్ల విలువ చేసే ఇల్లు ఉంది. లక్నోలోని ఇంటి విలువ రూ. 15 కోట్లు ఉంటుంది. 2010 మేలో ఆమె ఆస్తుల విలువ రూ. 87 కోట్లు. మాయావతి మంగళవారం ఉదయం రాజ్యసభకు నామినేషన్ వేశారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలు కావడంతో ఆమె ఢిల్లీలోనే ఉండాలని అనుకుంటున్నట్లు సమాచారం. జాతీయ రాజకీయాల్లో తృతీయ కూటమి ఏర్పాటు చర్చ ముందుకు వచ్చిన నేపథ్యంలో ఢిల్లీ రాజకీయాలపై దృష్టి పెట్టాలని ఆమె అనుకుంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications